టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. మెగా , నందమూరి, అక్కినేని ఫ్యామిలీ హీరోలు ఇప్పుడు టాప్ పొజీషన్లో ఉన్నారు. ప్రస్తుతం నందమూరి హీరోలుగా బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే బాలకృష్ణ నట వారసుడిగా త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఆయన తనయుడు మోక్షజ్ఞ. ప్రస్తుతం అందరి హీరోల కొడుకులు ఇండస్ట్రీ తండ్రి వారసత్వన్ని తీసుకున్నారు.
చిరంజీవి కొడుకు రాంచరణ్,నాగర్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ సురేష్ బాబు కొడుకు రానా ఇలా అందరు ఇండస్ట్రీకి పరిచియమై తమ తండ్రుల వారసత్వన్ని కొనసాగిస్తున్నారు.ఒక్క బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తప్పా. ఇండస్ట్రీలో చాలా కాలంగా నందమూరి ఫ్యాన్స్ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వేయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బోయపాటి తో టచ్ లో ఉంటున్నారని ఆ మద్య వార్తలు కూడా వచ్చాయి.
టీనేజీ వయసు దాటడంతోనే ఆ హీరో ఎంట్రీని నందమూరి అభిమానులు కోరుకోవడం మొదలుపెట్టారు. బాలయ్య కూడా కొడుకును బంపర్ హిట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయాలని భావించారు. 2018లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమన్నారు. కానీ తాజాగా బయటికొచ్చిన ఓ ఫోటోను చూస్తే మోక్షజ్ఞ ఇప్పట్లో సినిమాలు చేయడేమో అని అనిపించకమానదు.
ప్రస్తుం హీరోలు అంతా సన్నగా సిక్స్ ప్యాక్ తో మంచి ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నారు. ఈ ఫోటోలో మోక్షజ్ఞ కాస్త బొద్దుగానే కనిపిస్తున్నాడు. ఈ పర్సనాలీటి పెట్టుకుని సినిమాలలో హీరోలుగా చేయడం చాలా కష్టం ఈ విషయం బాలకృష్ణకి తెలుసు.మరి మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఎటువంటి డేసిషన్ తీసుకుంటాడో చూడాలి.