గత కొన్ని రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నటి శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డి చేస్తున్న ఆందోళన చిలికి చిలికి గాలి వాన అయ్యింది.  నెల రోజుల క్రితం వివిధ ఛానల్స్ లో ఇంటర్వ్యూలతో ఊదరగొట్టిన శ్రీరెడ్డి తనకు ‘మా’ అసోసియేషన్ వారు కార్డు ఇవ్వడం లేదని గుర్తింపు ఇవ్వడం లేదని అర్ధనగ్న ప్రదర్శన చేయడంతో పరిస్థితి సిరియస్ గా మారింది. ఈ విషయం నెషనల్ స్థాయికి చేరుకోవడంతో ఆమెకు మహిళా సంఘాలు, వివిధ స్టూడెంట్స్ యూనియన్లు మద్దతు తెలిపాయి.  దాంతో శ్రీశక్తి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసింది. 
Image result for sri reddy protest
ఈ నేపథ్యంలో జూనియర్ ఆర్టిస్టులు, సామాజిక కార్యకర్తలతో ఓ సమావేశం ఏర్పాటు చేయగా..అందులో ఓ జూనియర్ ఆర్టిస్ట్ నటి జీవిత, రాజశేఖర్ పై కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని సమర్థించారు..సామాజిక కార్యకర్త సంద్య.  మొత్తానికి ఇండస్ట్రీని కుదేలు చేస్తుంది కాస్టింగ్ కౌచ్ వ్యవహారం. ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం ఇపుడు నటి జీవితకు చుట్టుకుంది.
Image result for sri reddy protest
తన కుటుంబంపైన అసత్య ఆరోపణలను చేశారంటూ సామాజిక కార్యకర్త సంధ్యపైన, వాటిని ప్రసారం చేసిన ఛానల్‌పైన కేసులు పెడతానని జీవిత ఈ రోజు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సామాజిక కార్యక్త సంద్య తాను  చేసిన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు ఉన్నాయని, కొంతమంది ఇచ్చిన సమాచారంతోనే తాను ఈ ఆరోపణలు చేసాను అని అన్నారు.
Image result for sandya jeevitha
తమ వద్ద ఇంకా భయంకరమైన నిజాలు ఉన్నాయని..అవన్నీ బయటకు తీస్తే  చాలా అసహ్యంగా ఉంటుందని అన్నారు. సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, కమిట్ మెంట్ సిస్టమ్ లేదు అని ఆమె మాట్లాడటం కరెక్టు కాదనే దృష్టితోనే అలా అన్నాను. ఆమెను ఎటాక్ చేయడానికి నాకు ఇన్నేళ్లు ఎందుకు పడుతది.. అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే కేసును న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: