కన్నడ కుట్టి అయినా.. అచ్చం తెలుగమ్మాయిలా కనిపించే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురగొంది. చిన్న సినిమాల్లో నటించి హిట్ ట్రాక్‌ను సొంతం చేసుకుంది. కానీ సినీ ఇండస్ట్రీని మాత్రం మెప్పించలేకపోయింది. ఆ కారణంగానే ఆమెకు పెద్దగా సినిమా ఆఫర్లు రాలేదు.
Image result for madhavi latha
దాంతో సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి పవన్ కళ్యాన్ ఫ్యాన్ అంటూ చెబుతూ వస్తున్న హీరోయిన్ మాధవి లత. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌గారి దారిలోనే నడుస్తున్నానంటూ చెప్పుకొస్తున్న హీరోయిన్ మాధవీ లత ఆయనకు మద్దతుగా  ఫిల్మ్ చాంబర్ ఎదురుగా ధీక్ష చేస్తున్నారు.  ఏదైనా సమస్య ఉన్నప్పుడు చట్టప్రకారం వెళ్లడం మంచిది కానీ, చానెల్స్ చుట్టూ తిరగడం వల్ల సమస్య దూరం కాదని చెప్పిన పవన్ కల్యాణ్‌ని, వాళ్ల అమ్మని దూషించిన నటి శ్రీరెడ్డి తీరుపై మాధవీ లత మౌనదీక్షకు సిద్ధమయ్యారు.

‘‘పవన్ కల్యాణ్ అభిమానులకి, మానవత్వం ఉన్న వారికి, తెలుగు భాష మీద ప్రేమ ఉన్న వారికి ఇదే నా ఆహ్వానం. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఫిల్మ్ చాంబర్ కాంపౌండ్ వద్ద జరిగే ఈ దీక్షకు పొట్టనిండా తిని రండి’’ అంటూ మాధవీ లత పోస్ట్ చేసింది. కాగా, ఆమె దీక్షకు ఎంతో మంది జనసేన కార్యక్తలు, మెగా అభిమానులు మద్దతు ఇస్తున్నారు.  మౌన పోరాటం చేస్తున్న మాధవి లత ను పోలీసులు అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: