హీరోలు అప్పుడప్పుడూ తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే హీరోలు అలా సరదాగా వంటింట్లోకి దూరి తమ చేతి వంటను రుచి చూపిస్తుంటారు. తెలుగు హీరోల్లో చాలా మంది ఇలా చేసిన సందర్భాలున్నాయి. తాజాగా రంగస్థలంతో సూపర్ హిట్ కొట్టి దూసుకెళ్తున్న రాం చరణ్ వంటింట్లో చేతికి పని పెట్టారు.


          రాం చరణ్ తాజాగా నటించిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేసి రికార్డులు బ్రేక్ చేస్తోందీ సినిమా. ఈ సినిమా సక్సెస్ తో బిగ్గెస్ట్ కలెక్షన్ల క్లబ్ లో చెర్రీ చేరిపోయాడు. ఈ ఆనందాన్ని రాంచరణ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ మొత్తం రంగస్థలం హిట్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాడో ఏమో... వంటింట్లోకి దూరాడు చరణ్.


          ఉదయాన్నే నిద్రలేచే రాంచరణ్ వర్కవుట్ చేస్తుంటాడు. ఈరోజు కూడా అలాగే తన వర్కవుట్స్ చేసిన తర్వాత చరణ్ అలాగే వంటింట్లోకి దూరాడు. వేడివేడిగా అద్భుతమైన ఆమ్లెట్స్ వేశాడు. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసన వెల్లడించింది. మాస్టర్ చెఫ్ అనే క్యాప్షన్ చెప్పింది. అడోరబుల్ హజ్బెండ్ అని హ్యాష్ టాగ్ ఇచ్చింది. అంతేకాదు.. మా అందరికీ అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ వండిపెట్టాడంటూ పోస్ట్ చేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: