టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కాస్టింగ్ కౌచ్’ పేరుతో మహిళలను లొంగదీసుకుని వాడేసుకుంటున్నారంటూ శ్రీ రెడ్డి మొదలు పెట్టిన పోరాటం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంటర్నెట్, టీవీ సెన్సేషన్‌గా మారిన శ్రీ రెడ్డి తనకు, తనలాంటి వాళ్లకు జరిగిన అన్యాయం భవిష్యత్ లో ఇంకెవ్వరికీ జరగొద్దు అంటూ పెద్ద ఉద్యమమే తీసుకు వచ్చింది.  ఈ ఉద్యమానికి మహిళా సంఘాలు, కొందరు నేతలు గొంతు కలపడంతో శ్రీ రెడ్డి తన పోరాటాన్ని మరింత ఉదృతం చేసింది.
Image result for SRIREDDY
ఇటీవలే ఫిలించాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపిన ఈమె.. ఇండస్ట్రీలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల పట్ల ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీరెడ్డి తర్వాత ఓ మిడియాకు ఇచ్చిన ఇంర్వ్యూలో నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వేలు చూపించి కించ పరిచింది. దాంతో పవన్ అభిమానులు ఇప్పుడు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 
Image result for SRIREDDY
శ్రీరెడ్డి ఓ ఉద్యమం చేస్తుందని..అలా కాకుండా పవన్ కళ్యాన్ ని ఇందులోకి ఎందుకు తీసుకు రావడం..ఇదేమైనా రాజకీయ కోణం ఉందా అంటూ విమర్శిస్తున్నారు. అంతే కాదు మొన్నటి వరకు ఆమెకు సపోర్ట్ గా వచ్చిన వారు కూడా ఆమెకు పూర్తి వ్యతిరేకులు అయ్యారు.  ఓ టివి ఛానల్ లో డిబెట్ లో పాల్గొన్న శ్రీరెడ్డిపై లైవ్ గా దుమ్ముదులిపారు.  ఓ నటి శ్రీరెడ్డి గతంలో చెప్పిన ఓ విషయం చెప్పడంతో లైవ్ గా ఏడ్చేసింది. ప్రస్తుతం య్యూట్యూబ్ లో శ్రీరెడ్డి పై విమర్శలు వస్తున్నాయి.
Related image
టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పై గళమెత్తి, సినీ పెద్దలు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఫిల్మ్ చాంబర్ ముందు అనూహ్య నిరసనలు తెలియజేసిన నటి శ్రీరెడ్డి, తన ఫేస్ బుక్ ఖాతాలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ జీవితం ఇక చాలనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. ఈ ఉదయం 6 గంటల సమయంలో "ఎనఫ్ ఆఫ్ దిస్ లైఫ్" అంటూ పోస్టు పెట్టగా, అది నిమిషాల్లో వైరల్ అయింది.  అంతకు ముందు ఈ ప్రపంచంలో తొలిసారిగా తాను ఒంటరినన్న భావన కలుగుతోందని చెప్పింది. అలా చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని చెప్పింది. తనకు శాంతి కావాలని ఉందని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: