ప్రభాస్ ను నేషనల్ సెలెబ్రెటీగా మార్చిన ‘బాహుబలి’ క్రేజ్ లో దర్శకుడు రాజమౌళి ప్రతిభ ఉంది అంటూ ప్రభాస్ స్థాయిని తగ్గించడానికి గతంలో కొందరు ప్రయత్నించారు. అయితే ఎటువంటి టాప్ డైరెక్టర్ సహాయం లేకుండా కేవలం ఒక యంగ్ డైరెక్టర్ ను నమ్ముకుని ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ సినిమాకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తున్నాయి. 
prabhas saho movie latest photos కోసం చిత్ర ఫలితం
‘సాహో’ ను దర్శకుడు సుజిత్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నిర్మాణంలో దర్శకుడు సుజిత్ తనకు అనుభవం లేకపోవడంతో తప్పటడుగులు వేస్తున్నాడు అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. అయితే ఇలాంటి గాసిప్పులను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి-సిరీస్ ‘సాహో’ హిందీ వెర్షన్ హక్కులను 120 కోట్లకు తీసుకుంది అన్న వార్తలు వచ్చాయి. 
prabhas saho movie latest photos కోసం చిత్ర ఫలితం
ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ ‘సాహో’ ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసే అవకాసం తమకు ఇస్తే ఈమూవీని 300 కోట్లకు టోటల్ గా తీసుకుంటాము అని ఆఫర్ చేసినట్లు టాక్. ఈవార్తలే నిజం అయితే ప్రభాస్ ‘సాహో’ కు విడుదల కాకుండానే 100 కోట్ల లాభం వచ్చినట్లు అవుతుంది. 
సంబంధిత చిత్రం
అయితే ‘సాహో’ ను నిర్మిస్తున్న ప్రభాస్ సన్నిహితులు యువీ క్రియేషన్స్ వారు మాత్రం టోటల్ గా ‘సాహో’ రైట్స్ ను టి-సిరీస్ సంస్థకు ఇవ్వాలి అంటే ఏకమొత్తంలో 400 కోట్లు అడుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈమూవీని ఏదోవిధంగా వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలి అన్న పట్టుదలలో ప్రభాస్ ఉన్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: