టాలీవుడ్లో ఒక ఉద్యమంలా మొదలయిన కాస్టింగ్ కౌచ్ ఇప్పుడు పక్కదారి  మళ్లింది. ఇన్నాళ్లు ఒక పద్దతి ప్రకారం ఇండస్ట్రీకి చెందిన పెద్ద పెద్ద తిమింగలాలను పట్టడానికి కూసింత దూరంలో ఉన్న ఈ ఉద్యమం, మొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై శ్రీ రెడ్డి రాయలేని అసభ్య పదజాలంతో దూషించడంతో చతికిలపడింది. పోరాటం  చేస్తున్న అందరు శ్రీ రెడ్డికి వ్యతిరేఖమయ్యారు.


తాజాగా ఆమె అనిన మాటలకు పవన్ సోదరుడు నాగబాబు స్పందించారు. మెగాస్టార్, మెగా ఫ్యామిలీ వారు మృదుస్వభావులు కాబట్టి రాయితో కొట్టినా ఏమీ అనరులే అని అనుకోవద్దని ఆయన హెచ్చరించాడు. మేము ఎప్పుడు ఎలా స్పందిస్తామో తెలియదు. మా జోలికి రాకండి, డబ్బులు తీసుకుని మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళందరూ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఆపేయండి అంటూ ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.


ఆయన ఇంకా మాట్లాడుతూ- సోషల్ మీడియాలో ఎవడో ట్రోలింగ్ చేస్తే మా ఫ్యామిలీని ఎందుకు అవమానిస్తున్నారని ఆయన ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ సినిమాల్లో కొన్ని కోట్లు వదులుకొని ప్రజాసేవచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు, నా తమ్ముడు దమ్మున్న మగాడు, ఇంకొన్ని రోజుల్లో మీ అందరి దూల తీర్చేస్తాడని సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. శ్రీ రెడ్డి వాళ్ల అమ్మగారిని దూషించిన విషయం ఆమెకు తెలుపగా వాళ్ళు అంటే అన్నారు! ఈ విషయం ఇంతటితో ఆపేయండి అని సమాధానం ఇచ్చిందని భావోద్వేగంగా చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: