తెలుగు ఇండస్ట్రీలో ‘పెళ్లిచూపులు’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ.  ఈ తర్వాత ‘ద్వారకా’ చిత్రం వచ్చినప్పటికీ పెద్దగా హిట్ కాలేదు.  ఇక సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారే స్టార్ ఇమేజ్ పెంచేసుకున్నాడు. మొదట ఈ చిత్రం ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.  అయితే రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో దుమ్మురేపే కలెక్షన్లు సాధించి మంచి విజయాన్ని దక్కించుకుంది. 

దీంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టాక్సీవాలా చిత్రంలో నటిస్తున్నాడు.  టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌సంస్థ‌లు జిఏ 2 , యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా నుంచి ఈ నెల 17 సాయంత్రం టీజర్ ను రిలీజ్ చేస్తామన్నట్టుగా చెప్పారు. అయితే కొన్ని కారణాల వలన టీజర్ రిలీజ్ ఒకరోజు వాయిదా పడింది.  సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ‘టాక్సీవాలా’ టీజర్ కొద్ది సేపటి క్రితం రిలీజ్ అయ్యింది. 

ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చి పెడుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు.  సినిమా ప్రమోషన్లో భాగంగా పోస్టర్స్, టీజర్ విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: