నటి శ్రీ రెడ్డి వ్యవహారం రోజుకు ఒక టర్న్ తీసుకుంటున్న నేపద్యంలో నిన్న రాత్రి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయమై విడుదలచేసిన ఒక వీడియో అత్యంత సంచలనంగా మారింది. బూతు పదాలు  ఉపయోగించి పవన్ కల్యాణ్ ను తిట్టమని శ్రీరెడ్డికి తానే సలహా ఇచ్చానని అంటూ ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అందువల్ల పొరపాటు ఏదైనా జరిగితే అది తన వల్లనే జరిగిందని చెపుతూ పవన్ కళ్యాణ్ కు క్షమార్పణలు చెప్పాడు వర్మ. 
 తెలిసినవి చెప్పాలనే.
అంతేకాదు నిర్మాత సురేశ్ బాబు కుమారుడు అభిరామ్ వ్యవహారంలో ఆమెకు కలిగిన నష్టానికి సురేశ్ బాబు కుటుంబం నుండి తాను 5కోట్ల సెటిల్మెంట్ శ్రీ రెడ్డికి తాను వ్యక్తిగతంగా ఆఫర్ చేసిన సీక్రెట్ ను బయటపెట్టాడు. అయితే శ్రీరెడ్డి ఈ ఆఫర్ తిరస్కరించడంతో తనకు ఆమె పై మరింత గౌరవం పెరిగింది అని అంటున్నాడు వర్మ.  
ఆ మాటతో శ్రీరెడ్డిపై మరింత గౌరవం..:
శ్రీ రెడ్డితో తనకు వ్యక్తిగత పరిచయం లేదు అన్న విషయాలను చెపుతూ తాను ఎంతో కష్టపడి ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెతో మాట్లాడటానికి గల కారణం ఆమె అర్థనగ్న ప్రదర్శన చేసిన తర్వాత ఆమె పోరాటాన్ని తాను మరింత సీరియస్ గా తీసుకోవడమే కాకుండా ఆమె పై మరింత గౌరవం పెరిగింది అని అంటున్నాడు
ఈవివాదాల దర్శకుడు. తనకు సురేశ్ బాబు కుటుంబం ఎప్పటి నుంచో తెలుసు అని చెపుతూ ఆ పరిచయంతోనే శ్రీ రెడ్డికి తాను 5 కోట్ల ఆఫర్ ఇచ్చినా ఆమె ఆ ఆఫర్ ను తిరస్కరించడం బట్టి ఆమె క్యాస్టింగ్ కౌచ్ విషయంలో చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ కనిపిస్తోంది అంటూ శ్రీ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశాడు వర్మ. 
రూ.5కోట్ల ఆఫర్ వద్దంది..
ఇలా ఊహించని ట్విస్ట్ వర్మ ఇవ్వడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నాయి. వర్మ ఈ వ్యవాహారం నడపడంలో ఆంతర్యం ఏమిటి అంటూ కొందరు వర్మ మాటలు వెనుక ఉన్న అర్ధాలను వెతకడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తప్పు అంతా వర్మ అకౌంట్ లోకి వెళ్లిపోయింది కాబట్టి ఇప్పటి వరకు శ్రీ రెడ్డిని దుమ్మెత్తి పోసిన ఇండస్ట్రీ వర్గాలు అదేవిధంగా పవన్ వీరాభిమానులు శ్రీ రెడ్డి విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అన్న విషయం అత్యంత ఆసక్తిదాయకంగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: