ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులుపరంగా ‘శ్రీమంతుడు’ అంటూ అతడితో సినిమాలు తీసే దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో రేపువిడుదల కాబోతున్న ‘భరత్ అనే నేను’ కూడ రికార్డులను సృష్టిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తనకు జూనియర్ ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఇచ్చిన సలహాకు కొద్దిగా ఆలస్యంగా ఘాటైన సమాధానం ఇచ్చాడు. 
MAHESH BABU MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
‘భరత్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తనకు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సలహా పై కామెంట్ చేస్తూ జూనియర్ చెప్పినవిధంగా తన సినిమాలలో ప్రయోగాలు చేసే శక్తి తనకు పూర్తిగా తగ్గిపోయిందనీ అంటూ భవిష్యత్ లో ఇలా ప్రయోగాలు చేసుకుంటూపోతే తన అభిమానులు తన తండ్రి అభిమానులు తనఇంటికి వచ్చి తనను కొట్టే పరిస్థుతులు ఏర్పడతాయి అంటూ జోక్ చేసాడు. అంతేకాదు భవిష్యత్ లో తాను చేయబోయే సినిమాలు అన్నీ కమర్షియల్ సినిమాలుగా ఉంటాయి అంటూ లీకులు ఇచ్చాడు మహేష్. 
సంబంధిత చిత్రం
‘భరత్’ లో ముఖ్యమంత్రి పాత్రను పోషించిన తనకు ఇప్పటికీ రాజకీయాలు అంటే అభిరుచి లేదనీ వచ్చే ఎన్నికలలో తాను ఏపార్టీకి ప్రచారం చేయను అన్న తన స్పష్టమైన అభిప్రాయాన్ని బయటపెట్టాడు మహేష్. ఇదే సందర్భంలో తన నటన విషయంలో తనకున్న పరిమితులు గురించి మాట్లాడుతూ ఉద్వేగపూరితంగా డైలాగులు చెప్పలేను అన్న విషయాన్ని బయటపెడుతూ తన తండ్రి నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ ‘ఈనాడు’ సినిమాలలోని డైలాగులను తన తండ్రి కృష్ణలా అనుకరిద్దామని తన ఇంటిలో చేసిన ప్రయత్నాలు తనకే నచ్చలేదు అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు మహేష్. 
MAHESH BABU MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
‘భరత్’ మూవీలో ఎటువంటి రాజకీయ వ్యంగాస్త్రాలు ఉండవు అని చెపుతూ నిజాయితీతో కూడిన ఒక రాజకీయనాయకుడు ఉంటే ఎంత బాగుంటుంది అన్న ఊహ మాత్రమే తన ‘భరత్’ లో కనిపిస్తుంది అంటూ ‘భరత్’ లో రాజకీయ సెటైర్లు ఉండవు అన్న విషయానికి క్లారిటీ ఇస్తున్నాడు. ఇక ఈమూవీ తన తల్లి పుట్టినరోజునాడు విడుదల కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది అని చెపుతూ అయితే చిన్న తనంలో తాను తన తల్లికి ఇచ్చిన మాటను నిలుపుకున్నానా లేదా అన్న విషయం తనకు గుర్తుకు రావడం లేదు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు భరత్..   


మరింత సమాచారం తెలుసుకోండి: