తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై కొన్ని రోజుగా దుమారం చెలరేగుతుంది. ఈ విషయంలో శ్రీరెడ్డి రోడ్డక్కడం..అర్థనగ్న ప్రదర్శన చేయడం..పలువురుని విమర్శించడం వంటివి జరిగాయి. అయితే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై శ్రీరెడ్డి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలకు టాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే..కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు, సామాజిక కార్యకర్తలు తెలుగు ఇండస్ట్రీపై నీచంగా మాట్లాడటం మొదలు పెట్టారు. దీనిపై స్పందించిన ప్రముఖ నిర్మాత  తమ్మారెడ్డి భరద్వాజ ఇండస్ట్రీ నీచంగా ఉంటుందని వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని కొట్టిపారేశారు.
Image result for sri reddy protest
ఇండస్ట్రీ నీచంగా ఉంటే మా పిల్లలను ఎందుకు తీసుకొస్తామని ప్రశ్నించిన ఆయన వేధింపులపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను శ్రీరెడ్డి ఎందుకు తప్పుబడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.   శ్రీరెడ్డి ఇష్యూపై తొలిసారిగా స్పందించింది తానే అన్నారు తమ్మారెడ్డి.  ఇండస్ట్రీలో కొందరు చేస్తున్న తప్పులను అందరికీ ఆపాదించడం సరైంది కాదన్నారు.
Image result for sri reddy meeting
కొందరి వల్లే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ జరుగుతుందన్న తమ్మారెడ్డి… వేధింపులపై ఎవరికీ ఫిర్యాదు చేయకుంటే న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అయితే క్యాష్ కమిటీ వేసుందుకు చర్యలు తీసుకుంటున్నామన్న తమ్మారెడ్డి… పారదర్శకంగా వ్యవహరించే సభ్యులను ఎంపిక చేయడమే సమయం పడుతోందని… రెండు మూడు రోజుల్లో క్యాష్ కమిటీ పేర్లు ప్రకటిస్తామని తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి ఏపీకి సినీ ఇండస్ట్రీ రావడానికి సమయం పడుతుందన్నారు… ఐదేళ్లలో ఏపీకి సినీ ఇండస్ట్రీ వస్తుందనుకుంటున్నానన్న తమ్మారెడ్డి… మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడానికి 40 ఏళ్లు పట్టిన విషయాన్ని గుర్తు చేశారు… అయితే ఇప్పటికే ఏపీలో 30 శాతం షూటింగ్‌లు జరుగుతున్నాయన్నారాయన.


మరింత సమాచారం తెలుసుకోండి: