టాప్ హీరోల సినిమాలకు సంబంధించి నిర్వహింపబడే ఆడియో ఫంక్షన్స్ కు పాస్ లు లభిస్తే చాలు జీవితంలో లాటరీ తగిలినంత ఆనందం పొందుతారు అభిమానులు. ఎన్ని కష్టాలు పడి అయినా ఎండను వానను లెక్క చేయకుండా తమ హీరోలను ఆడియో ఫంక్షన్స్ లో చూడటానికి అభిమానులు వస్తూ ఉంటారు. 
naaperu surya movie latest photos కోసం చిత్ర ఫలితం
అయితే ఇలాంటి అభిమానులకు కండిషన్స్ పెడుతూ త్వరలో జరగబోతున్న అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఆడియో ఫంక్షన్ ఈ నెల 22న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం సమీపంలోని మాధవరంలో జరగబోతోంది. 
సంబంధిత చిత్రం
ఈ ఊరులో ఉండే ప్రతి కుటుంబం నుండి ఎవరో ఒక వ్యక్తి మన దేశ ఆర్మీలో పనిచేస్తూ ఉంటారు. అందుకే ఈ ఊరును మిలట్రీ మాధవరం అని అంటారు. బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా ‘నా పేరు సూర్య’ లో కనిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ ఫంక్షన్ ను మాధవరంలో చేయబోతున్నారు. 
naaperu surya movie latest photos కోసం చిత్ర ఫలితం
అయితే ఈ ఫంక్షన్ కు వచ్చే అల్లు అర్జున్ అభిమానులు అంతా ఆర్మీ డ్రెస్ కోడ్ ను పాటిస్తూ సైనికులు తెల్ల షర్ట్‌, నల్లఫ్యాంట్‌ ధరించి రావాలనీ ఈమూవీ యూనిట్ అల్లు అర్జున్ అభిమానులను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ తరువాత ఏప్రిల్ 29న హైదరాబాద్ లో ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫంక్షన్ కు హీరో ప్రభాస్ తో పాటు మెగా స్టార్ చిరంజీవి కూడ వస్తున్న నేపధ్యంలో అల్లు అర్జున్ తాను అందరి వాడినీ అని సంకేతాలు ఇచ్చే విధంగా అత్యంత భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశభక్తి ప్రధాన అంశంగా నిర్మించిన ఈమూవీతో అల్లు అర్జున్ కోరుకుంటున్న 150 కోట్ల కలక్షన్స్ రికార్డులను చేరుకోవాలని బన్నీ కలలు కంటున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: