ప్రముఖ నిర్మాత బన్నీ వాసు అల్లుఅర్జున్ కు ముఖ్య స్నేహితులలో ఒకడు అన్న విషయం  అందరికీ తెలిసిందే. అల్లు కాంపౌండ్ కు అతి సన్నిహితంగా ఉండే బన్నీ వాసు గతంలో చాల తక్కువగా మాట్లాడుతూ మీడియాకు ఏమాత్రం అందుబాటులో ఉండేవాడు కాడు. అయితే గత కొంత కాలంగా ఇతడు కూడ కొన్ని టాలీవుడ్ సమస్యల పై తనదైన తీరులో ఘాటుగా స్పందిస్తున్నాడు. 
 తిట్టమని వర్మే చెప్పాడట
ఇలాంటి పరిస్థుతులలో శ్రీ రెడ్డి పవన్ టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వెనుక రాంగోపాల్ వర్మ ప్రమేయం ఉందని తెలుసుకున్న బన్నీ వాసు ఆశ్చర్యం వ్యక్త పరచడమే కాకుండా ఈవిషయంలో నడిచిన హైడ్రామాను గమనించిన తరువాత తాను ఆవేశంతో రగిలిపోతున్నానని  బన్నీ వాసు కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇతడు ఈ రోజు మెగా ఫాన్స్ తో సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
 రంగంలోకి మెగా ఫాన్స్
మెగా యుద్దానికి సిద్ధం అవ్వండి అంటూ బన్నీ వాసు మెగా అభిమానులకు పిలుపును ఇవ్వబోతున్నట్లు కూడ తెలుస్తోంది. ఈ సాయంత్రానికి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామనిబన్నీ వాసు లీకులు ఇస్తున్నట్లు సమాచారం. గతంలో ప్రజారాజ్యం పార్టీ విషయంలో కూడ ఇలాగే చిరంజీవిని దుమ్మెత్తి పోసారనీ మళ్ళీ అదే పరిస్థితి పవన్ కు రాబోతోంది అన్న అభిప్రాయాన్ని బన్నీ వాసు తన సన్నిహితుల వద్ద వ్యక్తపరుస్తున్నట్లు టాక్. 
ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే అల్లు అర్జున్ కు పవన్ కళ్యాణ్ కు దూరం పెరిగింది అని వార్తలు వచ్చిన నేపధ్యంలో అనుకోకుండా అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని అల్లు అర్జున్ బన్నీ వాసు ద్వారా పవన్ అభిమానులకు దగ్గర అయ్యే ప్రయత్నాలలో భాగమే ఈ బన్నీ వాసు వ్యూహం అని అంటున్నారు. తన పై ఎంతమంది మాటల దాడి చేస్తున్న అవన్నీ పట్టించుకోకుండా శ్రీ రెడ్డి తన వేగాన్ని మరింత పెంచి మరిన్ని లీకులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటూ  టాలీవుడ్ ఇండస్ట్రీని మరింత షేక్ చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: