గత కొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ అంటు దుమారం లేపిన శ్రీ రెడ్డి ఇప్పుడు వ్యక్తిగత దూషనలు చేయడంతో విషయం కాస్త సీరియస్ అయ్యింది.  తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది అమ్మాయిలను సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని దర్శక, నిర్మాతల నుంచి జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే వారు సైతం పడక సుఖం కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపిస్తూ వచ్చారు.  శ్రీరెడ్డికి చేస్తున్న ఉద్యమానికి మహిళా సంఘాలు కూడా మద్దతు ఇస్తూ వచ్చాయి. మొన్న శ్రీరెడ్డి.. పవర్ స్టార్ పవన్ కళ్యాన్..ఆయన తల్లిపై దారుణమైన మాటలు మాట్లాడటంతో..పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కాస్టింగ్ కౌచ్ పైపోరాడే శ్రీరెడ్డి పర్సనల్ విషయాల జోలికి ఎందుకు వెళ్లిందని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికే శ్రీరెడ్డి పై తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో కేసులు కూడా పెట్టారు. తాజాగా సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను దూషించిన యువనటి శ్రీరెడ్డిపై సినీనటుడు శివ బాలాజీ హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
Image result for shiva balaji
వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పవన్‌పై శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు స్పష్టమైన విషయం తెలిసిందే. ఆయనపై కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీరెడ్డి వ్యక్తిగత దూషణలు చేసిన ఈ కేసు సమర్థవంతంగా ముందుకు వెళితే, ఆమెకు రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: