సాధారణంగా హీరోలు హీరోయిన్లు రిచ్ నెస్ మెయింటైన్ చేశారు. వాళ్లిచ్చే బహుమతులు కూడా అంతే రిచ్ గా ఉంటాయి. ఈ మధ్యే హీరో మహేశ్ బాబు తన మూవీ టీం అందరికీ ఖరీదైన ఐఫోన్ లను అందించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు మరో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఇలాగే షాక్ ఇచ్చింది.

Image result for jacqueline fernandez

          జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ నటి. 2009లో బాలీవుడ్ లోకి ఎంటరైన ఈ విదేశీభామ మంచి మంచి సినిమాలు చేసి ఆకట్టుకుంది. మోడలింగ్ నుంచి ఈ భామను బాలీవుడ్ బాగానే ఆదరించింది. ఈ ఏడాది కూడా 3 సినిమాలు చేయబోతోంది. జాక్వెలిన్ ఇండస్ట్రీకి ఎంటరైనప్పటి నుంచి తనకు షాన్ ముత్తాతిల్ అనే వ్యక్తి మేకప్ మ్యాన్ గా ఉంటున్నాడు. ఆయన ఈ మధ్యే తన బర్త్ డే జరుపుకున్నాడు.

Image result for jacqueline fernandez

          షాన్ ముత్తాతిల్ కు జాక్వెలిన ఏకంగా ఓ ఖరీదైన కారును గిఫ్ట్ గా పంపించారట. ఆ గిఫ్ట్ తోనే తన బర్త్ డే ప్రారంభమైందంటూ ముత్తాతిల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. మీరు పంపించిన గిఫ్ట్ నాకు నిజంగా సర్ ప్రైజ్ కలగించిందన్నాడు. కారు దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడియో తీయాలని మీరు చెప్పినప్పుడు ... అది నా కోసమే పంపించారని నేను నమ్మలేదన్నాడు. దీనికి సంబంధించిన వీడియోలను ముత్తాతిల్ సోషల్ మీడియాలో పాల్గొన్నాడు.

Image result for jacqueline fernandez

          సో.. అలా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన మేకప్ మెన్ కు గుడ్ సర్ ప్రైజ్ ఇచ్చిందన్నమాట. జాక్వెలిన్ ఇచ్చిన ఆ సర్ ప్రైజ్ నుంచి ముత్తాతిల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దాని నుంచి కోలుకోలేకపోతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: