నిన్న అర్దరాత్రి సమయంలో భావోద్వేగం మధ్య వేదాంత ధోరణితో పవన్ చేసిన ట్విట్స్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. తనను తన తల్లిని టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసిన మాటల దాడికి ఆమె క్షమార్పణలు చెప్పినా ఆమెను నడిపించిన వ్యక్తి ఎవరో స్పష్టంగా అందరికీ తెలిసిపోయినా ఆ కామెంట్స్ ఫై మెగా కుటుంబానికి కలిగిన ఆవేశం ఇప్పట్లో చల్లారే అవకాశం కనిపించడం లేదు.
సంబంధిత చిత్రం
తమ మధ్య విభేదాలను పట్టించుకోకుండా మెగా ఫ్యామిలీ అంతా ఒక త్రాటి పైకి వచ్చి పవన్ కళ్యాణ్ పై వస్తున్న విమర్శలకు ఎదురుదాడి చేస్తున్న నేపధ్యంలో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న పవన్ తన మౌనం వీడి నిన్న అర్దరాత్రి స్పందించాడు. ‘నేను హీరో కాకముందు రాజకీయ నాయకుడు కాకముందు ఒక తల్లికి కొడుకుని. ఆమె గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆ విషయాన్ని ఎదిరించలేని స్థితిలో ఉంటే జీవించడం కన్నా మరణించడం మంచిది’ అంటూ మొట్టమొదటిసారి పవన్ తన తల్లి పై జరిగిన మాటల దాడి పై స్పందించాడు. 
సంబంధిత చిత్రం
‘నేను ఈరోజు నుంచి ఏక్షణాన్న అయినా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్ళుతున్నాను. నేను ఈ దోపిడీ వ్యవస్థ పై చేస్తున్న పోరాటంలో ఒక వేళ అనుకోకుండా చనిపోతే నిస్సహాయులకు అండగా ఈ దోపిడీ వ్యవస్థ పై పోరాటం చేస్తూ నేను చనిపోయాను అనుకుంటే చాలు’ అంటూ తన పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వ్యక్తులు శక్తుల పై తన తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచాడు పవన్. 
సంబంధిత చిత్రం
పవన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి అనూహ్యంగా మద్దతు పెరుగుతున్న నేపధ్యంలో పవన్ ఇలా వ్యూహాత్మకంగా తన వేదాంత ధోరణిని వ్యక్త పరుస్తూ పెట్టిన ఈ ట్విట్స్ లో అసలు ఎత్తుగడ ఏమిటి అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈమధ్య కాలంలో పవన్ రాజకీయపరంగా కొన్ని వ్యూహాత్మక తప్పులు చేస్తున్నాడు అని విమర్శలు వస్తున్న నేపధ్యంలో అనుకోకుండా శ్రీ రెడ్డి తన తల్లి పై చేసిన కామెంట్స్ ను ఇలా వ్యూహాత్మకంగా తిప్పికొట్టి మరొక కొత్త అంశం పై చర్చలు రేపుతూ తన అభిమానుల పై తన పట్టును మరింత పెంచుకోవడానికి ఈ ట్విట్స్ పవన్ కు మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: