మహేష్ కు ఈ సినిమా ను కొరటాల సుమారు నాలుగు గంటలు చెప్పాడని మహేష్ బాబే చెప్పాడు. అయితే అన్ని గంటలు కథ నేరేషన్ చెప్పాడంటే ఇది చాలా పెద్ద కథ అని తెలుస్తుంది. ఇంత పెద్ద కథ ను కుదించి మూడు గంటలు చేశారు. ఇంత పెద్ద స్టోరీ ని ట్రిమ్ చేసినప్పుడు చాలా చోట్ల నాకు నచ్చిన సీన్లు పోయాయని మహేష్ చెప్పాడు. అయితే ఇంత పెద్ద స్టోరీ ఉనప్పుడు రెండు పార్ట్స్ గా తీస్తారేమో అని ఆలోచనలు రావొచ్చు. 

Image result for bharat anu nenu

సెట్స్ పైకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 4గంటల సినిమాను తీశామంటున్నాడు మహేష్.. ఫైనల్ గా అందులోంచి గంట నిడివిని తగ్గించి, 3గంటల సినిమాగా ప్రేక్షకుల ముందుకొస్తున్నామని తెలిపాడు. అంటే.. 5గంటల సినిమాను 4గంటలకు తగ్గించి, ఆ తర్వాత ఎడిటింగ్ టేబుల్ పై మరో గంట కుదించారన్నమాట.

Image result for bharat anu nenu

భరత్ అనే నేను సినిమా నిడివి పెరగడానికి ఇది కూడా ఓ కారణం అంటాడు మహేష్. సినిమాలో ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని, ఏమాత్రం తగ్గించినా ఫీల్ మిస్ అయిపోతుందని, అందుకే దాదాపు 3గంటల నిడివితో సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపాడు. ఎడిటింగ్ దశలో కట్ చేసిన సన్నివేశాల్లో తనకు నచ్చిన సీన్లు చాలానే ఉన్నాయంటున్నాడు మహేష్. బాహుశా సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత డిలీటెడ్ సీన్స్ పేరిట వాటిని దశలవారీగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: