మహేష్ ముఖ్యమంత్రిగా నటించిన ‘భరత్ అనే నేను’ మూవీకి సంబంధించి అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. ఈ షోల నుండి వస్తున్న రెస్పాన్స్ మహేష్ అభిమానులు పండుగ చేసుకునే విధంగా కనిపిస్తోంది. ఈమూవీ ఖచ్చితంగా మహేష్ అభిమానులకు అన్ని విషయాలలోనూ పూర్తిగా నచ్చుతుందని అంటున్నారు. 
సీఎంగా ప్రిన్స్ మహేష్‌బాబు
ఈమూవీ ఫస్ట్ ఆఫ్ చాలా బావుంది అనీ సెకండ్ హాఫ్ పరవాలేదనిపించే విధంగా ఉంది అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ‘భరత్ అనే నేను’ చిత్రం ‘శ్రీమంతుడు’ ని మించి సక్సస్ అవుతుందనీ ఈసినిమాను చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఇండియాలోని తమ సన్నిహితులకు మెసేజ్ పెడుతున్నట్లు సమాచారం.
మదర్ సెంటిమెంట్
ముఖ్యంగా ఈమూవీలోని ప్రెస్ మీట్ సన్నివేశాల్లో మహేష్ నటన అద్భుతం అనీ అసెంబ్లీ సన్నివేశాల్లో మహేష్ బాబు చెబుతున్న డైలాగులకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడ ఆనందంతో చప్పట్లు కొడుతున్నారని అమెరికా నుండి ప్రాధమిక వార్తలు వస్తున్నాయి. ‘భరత్’ మూవీలో ఎటువంటి సంచలనాలు లేకపోయినా సింపుల్ గా షార్ప్ గా ఉందని అమెరికా నుండి ప్రాధమిక టాక్ అందుతోంది. 
 బుల్లెట్‌లా పేలే డైలాగ్స్, పాటలు
కొరటాల శివ అద్భుతమైన స్క్రీన్ ప్లే ఈసినిమాకు ఆయువుపట్టుగా మారిందని అంటున్నారు.  ముఖ్యంగా ఈసినిమాలోని హెలికాఫ్టర్ సన్నివేశంలో మహేష్ ను చూడాల్సిందే అంటూ మహేష్ కెరీర్ లో అదొక బెస్ట్ సీన్ అని ఈసినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నట్లు టాక్. అయితే ఈమూవీ సెకండ్ ఆఫ్ అంచనాలను మించిపోయేలా ఉందని ఓవర్సీస్ లోని మహేష్ అభిమానులు చెపుతూ ఉంటే సెకండ్ హాఫ్ విషయంలో ‘భరత్’ తడబడింది అంటూ మరికొందరు ఓవర్సీస్ ప్రేక్షకులలోని విమర్శకులు లీకులు ఇస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈమూవీలోని దుర్గమహల్ ఫైట్ సీన్ ఈసినిమాకు హైలైట్ గా నిలిచింది అని అంటున్నారు. అయితే ఈమూవీ పై స్పష్టమైన టాక్ రావడానికి మరి కొన్ని గంటలు పట్టే సమయం ఉన్నా ఈమూవీ ఓవర్సీస్ ప్రాధమిక టాక్ పాజిటివ్ గా రావడంతో మహేష్ అభిమానులు జోష్ లో ఉన్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: