గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తూ వచ్చింది...నటి శ్రీరెడ్డి.  అప్పటి వరకు వివిధ ఛానల్స్ లో..యూట్యూబ్స్ లో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ వచ్చిన శ్రీరెడ్డిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు..‘మా’ అసోసియేషన్ వారు తనకు కార్డు ఇవ్వలేదని ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేసింది.  దాంతో ఒక్కసారే శ్రీరెడ్డికి అనూహ్యంగా మద్దతు పెరిగిపోయింది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆమెకు సానభూతి పలకడమే కాదు మద్దతు కూడా ఇచ్చారు. 

తన పోరాటానికి ఒక్కసారే బలం చేకూరిందని భావించిన శ్రీరెడ్డి తన పేరు శ్రీశక్తిగా మార్చుకొని తెలుగు ఇండస్ట్రీనీ ప్రక్షాళన చేస్తానంటూ దూకుడు పెంచింది. కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు..మహిళా సంఘాలతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దానికి మంచి స్పందన రాగానే బయట ఓ యూట్యూబ్ ఛానల్ వారు అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాన్ ని..ఆయన తల్లిగారిని దారుణంగా తిట్టి మద్య వేలు చూపించడం పెద్ద సంచలం అయ్యింది.  అప్పటి వరకు శ్రీరెడ్డికి మద్దతు ఇచ్చిన వారు పవన్ కళ్యాన్ తిట్టడంతో అంతా రివర్స్ అయ్యారు. అంతే కాదు శ్రీరెడ్డి అంతు చూస్తామంటూ..ఫ్యాన్స్ ట్రోల్స్ పెట్టడం మొదలు పెట్టారు.
Image result for sri reddy protest
అయితే ఈ విషయంలో శ్రీరెడ్డి ఫోన్ కాల్స్ లీక్ అయ్యాయి..తనను పవన్ కళ్యాన్ ని తిట్టమని చెప్పింది..దర్శకుడు రాంగోపాల్ వర్మ అని అనడంతో..ఈ వివాదం మరోరూట్ కి మారింది.  ఇక దర్శకులు రాంగోపాల్ వర్మ తానే శ్రీరెడ్డిని ఆ మాటలు అనేలా ప్రోత్సహించానని..దాని వల్ల ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటుందని భావించానని..పవన్ కళ్యాన్ ఆయన ఫ్యాన్స్ కి క్షమాపణలు అంటూ ఓ విడియో పెట్టారు. ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపణలు సృష్టిస్తుంది.  ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలు వర్మపై ఆగ్రహంగా ఉన్నారు.

తాజాగా 'యుద్ధానికి సిద్ధంగా ఉండండి' అంటూ సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ అభిమానులకి నిర్మాత బన్నీ వాస్‌ ట్వీట్ చేశాడు. యువనటి శ్రీరెడ్డితో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ... సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ని తిట్టించిన విషయం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ వాస్‌ ట్వీట్ చేస్తూ... 'పవన్ ఫ్యాన్స్‌ శాంతియుతంగా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరేవాడిని.. కానీ, తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ ఆడిన డ్రామా గురించి తెలుసుకున్న తరువాత నన్ను నేనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.
Image result for pawan kalyan sri reddy
మెగా ఫ్యామిలీ యూనిటీ చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రణాళిక త్వరగా వేయండని పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ట్వీట్లు చేస్తున్నారు. మెగా అభిమానుల సమావేశం కూడా నిర్వహించాడు ఆ సమావేశంలో వర్మ పై ఎలాంటి వ్యూహాన్ని అమలు పరచాలో ఓ నిర్ణయానికి రానున్నారు . గతంలో పలుమార్లు చిరంజీవి ని పవన్ కళ్యాణ్ ని రాంగోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే . అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో శ్రీరెడ్డి విషయాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద డ్రామా కు తెరలేపాడు వర్మ పైగా పవన్ కళ్యాణ్ ని శ్రీరెడ్డి చేత తిట్టించాడు దాంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: