తెలుగు ఇండస్ట్రీలో లో కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంతో పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం జరిగింది. దాంతో మరో బ్లాక్ బస్టర్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు.  గతంలో శ్రీమంతుడు లాంటి హిట్ చిత్రం అందించిన కొరటాలతోనే తన తదుపరి చిత్రం తీయడానికి రెడీ అయ్యారు మహేష్ బాబు.  వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘భరత్ అనే నేను’. 
bharat ane nenu public review and rating
‘భరత్ అనే నేను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన మహేశ్ బాబు కెరీర్లోనే అతి పెద్ద హిట్ సొంతం చేసుకున్నాడు. మాట తప్పని సీఎంగా భరత్ పాత్రలో ఒదిగిపోయిన ప్రిన్స్.. బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టే పని మొదలుపెట్టాడు. మంతుడు సినిమాతో ప్రిన్స్‌తో కలిసి హిట్ కొట్టిన కొరటాల శివ, సూపర్ స్టార్‌తో వరుసగా రెండో హిట్‌ కొట్టాడు. యంగ్ సీఎంగా మహేశ్ అదరగొట్టినట్లు టాక్ వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా మహేశ్ బాబు నటన ఈ సినిమాకే హైలెట్ అని మూవీ చూసిన వాళ్లు చెబుతున్నారు.

విదేశాల నుంచి తిరిగొచ్చి అనూహ్య పరిస్థితుల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన యువకుడి పాత్రలో మహేశ్ అద్భుతంగా నటించారట. మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.  ఇప్పటికే కొన్ని చోట్ల ప్రిఫ్యూలు పడ్డాయి..ప్రీమియం షోలు చూసిన అభిమానులు సినిమాకు తిరుగులేదని అంటున్నారు. ప్రిన్స్ కెరీర్లోనే అత్యుత్తమ నటన కనబరిచాడని చెబుతున్నారు. ఇంటర్వెల్ ముందు హీరోను ఎలివేట్ చేసే విధానం బాగుందని చెబుతున్నారు.
Image result for భరత్ అనే నేను
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రధాన అంశం జవాబుదారీతనం. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ప్రాధాన్యాన్ని ఈ సినిమాలో చూపించారు.  భరత్ అనే నేను సినిమాలోని పాటల్ని చిత్రీకరించిన విధానం బాగుందని సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. ముఖ్యంగా టైటిట్ సాంగ్‌ను స్క్రీన్ మీద చూస్తే.. వచ్చే కిక్కే వేరంటున్నారు. ప్రి క్లయిమాక్స్ ప్రెస్‌మీట్‌లో మీడియాను లాగిపెట్టి కొట్టే రీతిలో బదులిచ్చారట.
Image result for భరత్ అనే నేను
టీఆర్పీల కోసం ప్రజల సమస్యలను పక్కనబెట్టి బెడ్రూం వ్యవహారాలను ఎలివేట్ చేసే ఉదంతాలపై ఘట్టి షాక్ ఇచ్చారు. మొత్తానికి దర్శకుడిగా శ్రీమంతుడు చిత్రంలో ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చారో.. మరోసారి ‘భరత్ అనే నేను’ కొరటాల గట్టి సందేశాన్నే ఇచ్చారని చెబుతున్నారు. భరత్ అనే నేను ప్రీమియం టాక్ మాత్రం పాజిటీవ్ గానే వస్తున్నా..సాయంత్ర వరకు ఈ చిత్రం రిజల్ట్ ఎలా ఉండబోతుంది..హిట్టా..ఫట్టా అనేది తెలియనుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: