‘భరత్ అనే నేను’ సినిమాను ప్రమోట్ చేస్తూ మహేష్ నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఈసినిమా షూటింగ్ పూర్తి అయ్యేసరికి నాలుగు గంటల రన్ టైం వచ్చే సినిమాగా మారడంతో ఈసినిమాను కూడ ‘బాహుబలి’ లా రెండు పార్ట్ లుగా విడుదల చేయాలా అన్న ఆలోచనలు వచ్చాయని అయితే ఒక రాజకీయ సినిమాను రెండు పార్ట్ లలో తీస్తే ప్రేక్షకులు హర్షించారు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీని కష్టపడి మూడు గంటలకు కుదించిన విషయాన్ని బయటపెట్టాడు నహేష్.
MAHESH LATEST MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈసినిమాలో ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుదించిన సన్నివేశాలలో తనకు బాగా నచ్చిన సన్నివేశాలు చాల ఉన్నాయి అని తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు మహేష్. ఈమాటలు మహేష్ నోటివెంట విన్న ఆ ఛానల్ యాంకర్ ‘భరత్’ మూవీ టాక్ వచ్చిన తరువాత ఈ సీన్స్ కొన్ని కలుపుతారా అని అడిగినప్పుడు మహేష్ వ్యూహాత్మకంగా సమాధానం దాటివేసాడు. 
సంబంధిత చిత్రం
ప్రస్తుతం అన్ని చోట్ల నుండి ఈసినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపధ్యంలో కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేయడానికి మరొక వారం తరువాత ఈ ఎడిటింగ్ సీన్స్ ను ‘భరత్’ కు కలుపుతారా అన్న సందేహాలు నిన్న ఇంటర్వ్యూలో మహేష్ అన్న మాటలను బట్టి కలుగుతున్నాయి.  ఇది ఇలా ఉండగా మహేష్ తనకు రాజకీయాలు తెలియవు అని చెపుతున్నా అతడి అభిమానులు మాత్రం ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. 
MAHESH LATEST MEDIA INTERVIEW PHOTOS కోసం చిత్ర ఫలితం
లేటెస్ట్ గా రాయలసీమ ప్రాంతంలోని వైసీపీ పార్టీ అభిమానులు మహేష్ ను పూర్తిగా ఓన్ చేసుకుని అనంతపురం జిల్లాలో అనేకచోట్ల సూపర్ స్టార్ కృష్ణ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ మహేష్ ల ఫోటోలతో భారీ ఫ్లక్సీలను ‘కృష్ణసేన’ పేరుతో ఏర్పాటు చేసి ధియేటర్ల ముందు పెట్టిన ఫ్లేక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహేష్ బావ గల్లా జయదేవ్ మహేష్ ను తెలుగుదేశం వైపు తిప్పుకోవాలని చూస్తుంటే మహేష్ బాబాయ్ ఆది శేషగిరిరావు మహేష్ ను జగన్ పార్టీ వైపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో వచ్చే ఎన్నికలలో మహేష్ స్టాండ్ పై సర్వత్రా ఆశక్తి నెలకొని ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: