కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా ఒకవైపు చంద్రబాబు విజయవాడలో దీక్ష చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ తన రూట్ మార్చి ఈరోజు హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ కు నిరసన తెలపడానికి తన మెగాకుటుంబ సభ్యులైన నాగబాబు అల్లుఅర్జున్ సాయిధరమ్ తేజ్ లతో ఫిలిం ఛాంబర్ కు రావడంతో అక్కడి వాతావరణం సంచలనంగామారినట్లుగా వార్తలువస్తున్నాయి. గతరెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల పై పవన్ తీవ్రఅసహనంలో ఉన్న విషయం తెలిసినదే. 
అందరి లెక్కలు తేలాల్సిందే
దీనితో పవన్ ఫిలించాంబర్ వద్ద నిరసన తెలిపేందుకు రావడం అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు అసలు శ్రీరెడ్డి ఎవరు ? ఆమె ఆందోళనకు దిగడానికి గలకారణాలు ఏమిటి ? ‘మా' సంస్థ పట్ల ఆమె అలా ఎందుకు ప్రవర్తించింది అనే విషయాల పై పవన్ చాలలోతుగా సమాచారం రాబడుతున్నట్లు టాక్. 
ఇండస్ట్రీపై ఇంత జరుగుతున్న మౌనం ఎందుకని ఆగ్రహం
ఈచర్చలలో పవన్ తో పాటు పరుచూరి వెంకటేశ్వరరావు, నరేష్, మెహెర్ రమేష్, సాయి ధరమ్ తేజ్ తదితరులు కూడ పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిఇలా ఉండగా పవన్ అత్యంత భావోద్వేగంతో మరో ట్విట్ చేసాడు. ‘నాపై ఆరోపణలు చేస్తున్నవారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్‌పీల కోసం షోలు నిర్వహిస్తున్నారు కదా ? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ ప్రస్తుతం అత్యంత సంచలనంగా మారింది. 
‘మా' అధ్యక్ష పదవికి శివాజీ రాజా రాజీనామా?
అంతేకాదు తన పై బురద జల్లడానికి తన కుటుంబం పై తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి 10కోట్ల డబ్బు ఖర్చుపెట్టి తనకు సంబంధంలేని విషయాల్లోకి తనను లాగి అదేవిధంగా తన తల్లిని తిట్టించి ఆవార్తలను పదేపదే ప్రసారం చేసిన కొన్ని ఛానల్స్ వ్యవహార శైలి పై పవన్ టార్గెట్ చేస్తూ ట్విట్ చేయడం మరింత సంచలనంగా మారింది. "మై డియర్ రిచ్ అండ్ పవర్ ఫుల్ మీడియా" నాకు, నా తల్లికి మాత్రమే ఎందుకు ఇంత ప్రత్యేకమైన ఎక్స్ క్లూజివ్ ట్రీట్ మెంట్ ఇచ్చారో చెప్పాలంటూ ప్రశ్నలు వేస్తున్న పవన్ ప్రశ్నలు ఈరోజు మీడియాకు హాట్ టాపిక్..


మరింత సమాచారం తెలుసుకోండి: