గత కొంత కాలంగా ఇండస్ట్రీలో మెగా హీరోల మద్య కొన్ని ఇబ్బందులు తలెత్తాయని..పవన్ కళ్యాన్ తో మెగా బ్రదర్, బన్నీ లు వ్యతిరేకత చూపిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి.  అప్పట్లో మెగాస్టార్ చిరంజీవితో కూడా కొన్ని విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చిన్నప్పటికీ..చిరంజీవి షష్టిపూర్తి రోజు నుంచి మొన్న ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ వరకు చిరంజీవి, రాంచరణ్ తో కొనసాగుతున్న అనుబంధం అభిమానుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.  ఇక శ్రీరెడ్డి ఎపిసోడ్ లో మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ..తన తమ్ముడు గురించి తెగ పొగిడేశారు..నా తమ్ముడు తల్చుకుంటే ఏదైనా చేయగలడని..వాడు దమ్మున్న మగాడని ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టి చెప్పగల సత్తా ఉన్నవాడని అన్నారు. 
Image result for mega heros
అయితే శ్రీరెడ్డి మొన్న పవన్ కళ్యాన్ ఆయన తల్లిపై మాట్లాడిన మాటలు అటు ఫ్యాన్స్..ఇటు మెగా కుటుంబ సభ్యులను గుండె కోతకు గురిచేశాయి. ఇక శ్రీరెడ్డి వెనుక ఉండి అంత దారుణంగా మాట్లాడించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఇప్పుడు యావత్ ఫిలిమ్ ఇండస్ట్రీ కోపోద్రిక్తులై ఉన్నారు.  తాజాగా ఈ ఉదంతపై పవన్ కళ్యాన్ తన కుటుంబ సభ్యులను నడిరోడ్డుమీదకు ఈడ్చారని..రావడం.. దీని వెనుక సీఎం కొడుకు లెవెల్ నుంచి మీడియా మహామహులు ఉన్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.

టీఆర్పీలు కావాలి కదా.. అన్ని షోలకు అమ్మను చూపిస్తా అంటూ పవన్ చెప్పగా.. ఫిలిం ఛాంబర్ కు వరుసగా మెగా హీరోలు అంతా చేరుకుంటున్నారు. నాగబాబు..పవన్ కళ్యాణ్ వచ్చారు. కొద్ది సేపటి తర్వాత అల్లు అర్జున్ కూడా అక్కడకు చేరుకొని ఎంతో ఎమోషన్ అయ్యాడు... పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూనే మధ్యలో హగ్ చేసేసుకున్నాడు...దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశాడు.  బన్నీ చూపించిన ఈ ఎమోషన్ అందరినీ కదిలించేసింది.  పవన్ ఫ్యాన్స్- బన్నీ ఫ్యాన్స్ అనే సెపరేట్ సెగ్మెంట్లు కనిపించాయి.

ఇది మెల్లగా చిరు ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ అనుకునే వరకూ వెళ్లిపోయింది. కానీ తామంతా ఒక్కటే అనే సందేశాన్ని మెగా ఫ్యామిలీ ఎప్పుడూ పంపుతూనే ఉంది. . ఇవాళ జరిగే ప్రెస్ మీట్ కు మొత్తం మెగా హీరోలు అంతా వచ్చేస్తున్నారు.

ఇప్పటికే సాయిధరం తేజ్.. వరుణ్ తేజ్ కూడా ఫిలిం ఛాంబర్ కు రాగా.. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ లు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. అంటే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా కలిసి తమపై జరిగిన కుట్రను ఖండించే ప్రోగ్రాం పెట్టుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: