పవన్ కళ్యాణ్ టీవి9 ఆంధ్రజ్యోతి టివి5 లను టార్గెట్ చేస్తూ చేసిన ఘాటైన వ్యాఖ్యలతో పాటు ఈ ఛానల్స్ ను ఎవరు చూడ వద్దు అంటూ ఇచ్చిన పిలుపు మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. దీనితో పవన్ తీరును ఖండిస్తూ నిన్నరాత్రి టీవీ5 ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించి పవన్ వ్యవహార శైలి పై తీవ్ర విమర్శలు కురిపించింది. 
సంబంధిత చిత్రం
అంతేకాదు మీడియాకు సంకెళ్ళు వేసే అధికారం పవన్ కు ఎక్కడ ఉంది అంటూ ఆ ఛానల్ ప్రసారం చేసిన చర్చా గోష్టిలో పవన్ వ్యవహార శైలి పై ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా పవన్ తన తీరును మార్చుకోవాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు పారిశ్రామిక వేత్త టీవి 9 అధినేత శ్రీని రాజు పవన్ కళ్యాణ్ పై పరువునష్టం దావా వేయబోతున్నట్లు కూడ ఆ ఛానల్ ప్రకటించింది. 
PAVAN KALYAN LATEST POLITICAL PHOTOS కోసం చిత్ర ఫలితం
పవన్ పై 50 కోట్ల దావాకు సంబంధించి 50 లక్షల స్టాంప్ ఫీజును అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఛానల్ 10 కోట్ల పరువు నష్టం దావాకు సంబంధించి 10 లక్షల స్టాంప్ ఫీజును కట్టి పవన్ టార్గెట్ చేస్తూ సివిల్ క్రిమినల్ చర్యల కోసం దావాలు వేసినట్లు తెలుస్తోంది. దీనితో తెలుగు మీడియాను శాసిస్తున్న ప్రముఖ ఛానల్స్ అన్నీ ఒక త్రాటి పైకి వచ్చి పవన్ ను కార్నర్ చేస్తూ వ్యూహాత్మక దాడి మొదలు పెట్టాయి అన్న విషయం స్పష్టమైంది. 
సంబంధిత చిత్రం
జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు రాజకీయ నాయకుడుగా ఎదగాలి అని ప్రయత్నిస్తున్న పవన్ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న విధంగా ప్రముఖ మీడియా సంస్థలతో శత్రుత్వం పెంచుకుని తప్పటడుగు వేసాడు అని అంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన సభ్యులతో కలవబోతున్న నేపధ్యంలో పవన్ పై ఈ ప్రముఖ మీడియా సంస్థలు మొదలుపెట్టిన దాడి పై ఎలా స్పందిస్తాడు అన్న విషయమై ఆసక్తి నెలకొని ఉంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాటాలు చేయవలసిన పవన్ ఇలా తన రూట్ మార్చి హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో పోరాటాలు చేస్తూ దీక్షలు చేస్తాను అని చెపుతూ ఉండటం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: