నిన్న రిలీజ్ అయిన భరత్ అను నేను సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను  స్వంతం చేసుకుంది. అయితే ఈ సినిమా లో కూడా కొరటాల తన మార్క్ డైలాగ్స్ తో సినిమా ను నడిపించాడు అని చెప్పవచ్చు. అయితే సినిమా పొలిటికల్ స్కోప్ ఉన్నది అయినా కమర్షియల్ ఎలెమెంట్స్ ఎక్కడ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకడు. అయితే అక్కడక్కడా ఒకే ఒకడు సినిమా ఛాయలు కనిపిస్తాయి. కరెప్ట్ అదికారులను తొలిగించడం, హీరోయిన్ లవ్ సీన్స్ .

Image result for bharath ane nenu

ఒకే ఒక్కడులో అర్జున్ ఈ పనే చేస్తాడు. మహేశ్‌ను కూడా అలాగే పంపించాడు కొరటాల. ఇక రచ్చబండ న్యాయం కూడా ఒకే ఒక్కడులో కాస్త చూసిందే. పబ్లిక్ తో మమేకం అవుతూ సీఎం, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే అధికారులను అక్కడిక్కడ సస్పెండ్ చేసి పంపించడం.. ఒకే ఒక్కడులోనూ, భరత్‌ లోనూ కామన్‌గా ఉండే పాయింట్.

Image result for bharath ane nenu

ఇక ఒకే ఒక్కడులో సీఎం పర్సనల్ సెక్రటరీగా మణివన్నన్ పాత్ర ఫుల్ హ్యూమర్‌ను పంచుతుంది. ఇక్కడ కూడా బ్రహ్మాజీ అదే పాత్రను చేశాడు కానీ, అంతటి హ్యూమర్ లేదు. ఇక హీరో సీఎం అయినప్పటికీ దర్శకుడు చాలా స్వేచ్ఛ తీసుకుని పాటలూ, ఫైట్లు చేయించాడు. ఇక్కడ కొరటాల లాజిక్‌ మిస్ కాకుండా జాగ్రత్త పట్టాడు. ఈ విషయంలో అభినందించవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: