పవన్ కళ్యాణ్ , రామ్ గోపాల్ వర్మ మధ్య ఆసక్తి కరమైన ట్విట్టర్ వార్ జరిగింది. పవన్ కళ్యణ్ ను శ్రీరెడ్డి చేత బూతు మాట అనిపించిన రామ్ గోపాల్ వర్మ మీద అందరు కోపంగా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ చాలా దిగజారిపోయినాడని అందరూ చెబుతున్నారు. సినీ పెద్దలు అందరూ రామ్ గోపాల్ వర్మ మీద ఫైర్ అవుతున్నారు. 

Image result for pawan kalyan and rgv

10కోట్లు ఖర్చుపెట్టి తన ప్రతిష్టను దిగజార్చేందుకు వర్మ, లోకేష్, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలిపి తనపై ఇలా దాడికి పాల్పడుతున్నారని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై వర్మ స్పందించాడు. పవన్ ను నెగెటివ్ గా కామెంట్ చేయనని అమ్మ మీద ఒట్టేశాను కాబట్టి లాజికల్ గా మాట్లాడతానంటూ తన వివరణ ప్రారంభించిన వర్మ.. ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా పవన్ ఆరోపిస్తున్న రేంజ్ కాన్స్పిరసీ థియరీ చదవలేదన్నాడు. చంద్రబాబు చేస్తున్న దీక్షను పక్కదోవ పట్టించడానికి, మహేష్ సినిమా నుంచి దృష్టిని మరల్చడానికే పవన్ ఇలా చేస్తున్నారని నేను ఆరోపించగలనని, కానీ ఆ పని చేయనని వర్మ బదులిచ్చాడు.

Image result for pawan kalyan and rgv

తను ఏ క్షణానైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకెళ్తున్నానని పవన్ చేసిన ట్వీట్ పై విమర్శలు గుప్పించాడు వర్మ. హీరో అయిన పవన్ శత్రువుల్ని చంపాలి కానీ తన చావు గురించి ఆలోచించకూడదన్నారు. చావు గురించి మాట్లాడితే ఫ్యాన్స్ కు బాధ కలుగుతుందని, ఇలా మాట్లాడ్డం పవన్ పై నమ్మకం పెట్టుకున్న కోట్లాది మంది ప్రజలకు మంచిది కాదని అన్నాడు వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: