ఈసంవత్సరం సమ్మర్ రేస్ కు వచ్చిన ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ సినిమాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారడంతో ఇక అందరి దృష్టి మే మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘నాపేరు సూర్య’ పై పడింది. అల్లు అర్జున్ ఇప్పటి వరకు వరస హిట్లు కొట్టుకుంటూ తన క్రేజ్ ను పెంచుకోవడమే కాకుండా తనకంటూ తన సొంత అభిమానులను లక్షల సంఖ్యలో పెంచుకున్నాడు బన్నీ.
సంబంధిత చిత్రం
సోషల్ మీడియాలో కూడ లక్షల సంఖ్యలో బన్నీకి ఫాలోయర్స్ ఉన్నారు. దీనితో మెగా క్యాంప్ నుండి బయటకు వచ్చి అల్లు అర్జున్ తనదైన రీతిలో ఎదుగుతున్నాడు అని భావించారు అంతా. అయితే అనూహ్యంగా బన్నీ యూటర్న్ తీసుకుని నిన్న ఫిలిం చాంబర్ లో హడావిడి చేస్తున్న పవన్ కు మద్దతుగా వెళ్ళడమే కాకుండా అక్కడ పవన్ ను చూడగానే భావొద్వేగానికి లోనై పవన్ ను కౌగలించు కోవడంతో పవన్ అడుగులలో అల్లు అర్జున్ అడుగులు వేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. 
సంబంధిత చిత్రం
ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చేనెల విడుదల కాబోతున్న బన్నీ ‘నాపేరు సూర్య’ కు సమస్యగా మారే ఆస్కారం ఉంది అంటున్నారు. ప్రస్తుతం పవన్ తీరును నిరశిస్తూ అనేక ప్రముఖ ఛానల్స్ పవన్ ను ఇంచుమించు బ్లాక్ చేసాయి. ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగే పరిస్థితి కనపడుతోంది. అదే పరిస్థితి కొనసాగితే చాల ప్రముఖ ఛానల్స్ పవన్ తో పాటు మెగా హీరోల కార్యక్రమాలను కూడ పెద్దగా ప్రసారం చేయకపోవచ్చు. 
ALLU ARJUN IN NAA PERU SURYA MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అదే పరిస్థితి ఏర్పడితే మే మొదటివారంలో రాబోతున్న ‘నాపేరు సూర్య’ మొదటిగా నష్టబోతుంది. ఇప్పటికే చెప్పుకోతగ్గ ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ లేకపోవడంతో పాటు ఈమూవీ పాటలకు కూడ పెద్దగా స్పందన రాని నేపధ్యంలో ఈమూవీ మార్కెట్ ఇంకా పూర్తి కాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ‘రంగస్థలం’ ‘భరత్ అనే నేను’ క్రియేట్ చేసిన రికార్డులు ‘నాపేరు సూర్య’ పై ఒత్తిడి పెంచుతున్న నేపధ్యంలో లేటెస్ట్ గా పవన్ పవర్ ఫుల్ మీడియా వర్గాలతో ఏర్పరుచుకున్న శతృత్వం పరోక్షంగా బన్నీ ‘సూర్య’ కు శాపంగా మారుతుంది అని అంటున్నారు. ఈ సమస్యను బన్నీ తెలివిగా ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: