గత నెల రోజుల నుంచి కాస్టింగ్ కౌచ్ పై తెగ పోరాటం చేస్తున్న నటి శ్రీశక్తి అలియాస్ శ్రీరెడ్డికి మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా తోడయ్యాయి.  ఇక ఉద్యమాన్ని ముందుకు సాగించాలని మహిళా సంఘాలు, జూనియర్ ఆర్టిస్టులు కలిపి ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. అది మంచి సక్సెస్ కాగానే శ్రీరెడ్డి తెగ ఆవేశంతో పవన్ కళ్యాన్ ఆయన తల్లి పై అనరాని మాటలు అనడంతో..ఓ వైపు పవన్ ఫ్యాన్స్, ఆమెకు మద్దతు ఇస్తున్న వారు అంతా రివర్స్ అయ్యారు.  నువు మొదలు పెట్టింది కాస్టింగ్ కౌచ్ పై పోరాటం..కానీ వ్యక్తిగత విషయాలు..రాజకీయాలు నీకెందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే ఈ శ్రీరెడ్డి ఎపిసోడ్ లో దర్శకుడు రాంగోపాల్ వర్మ దలదూర్చారు..ఆ మాటలు తానే అనమన్నట్లు ఓ విడియో పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడు రాంగోపాల్ వర్మపై మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు.  ఇదిలా ఉంటే మొదటి నుంచి శ్రీరెడ్డి వ్యవహారాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న నటి కరాటే కల్యాణి ఫేస్ బుక్ యుద్ధం ప్రారంభించింది.  'శ్రీరెడ్డి లీక్స్' పేరిట కొన్ని ఫొటోలను పోస్టు చేసి, శ్రీరెడ్డి టాలీవుడ్ లో కలకలం రేపినట్టే.. కల్యాణి కూడా కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆమె వాటిపై స్పందిస్తూ, ‘కల్యాణి లీక్స్ (truths) మొదలయ్యాయి. 

ఇప్పటి వరకు శ్రీరెడ్డి ఎన్నో నీతి వాఖ్యలు మాట్లాడుతుందే..పెళ్లి కాని విమల (శ్రీరెడ్డి) కు ఇంత పెద్ద కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతోంది. మొన్ననే ఆ చదువు కూడా పూర్తైపోయింది. లేదు ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే...విమల (శ్రీరెడ్డి) కు కుటుంబంతో 10 సంవత్సరాల నుండి సంబంధం లేకపోతే కొంత కాలం క్రిందట కూకట్‌ పల్లిలో లోథా మెరిడియన్‌లో కోటిన్నర విలువగల ఫ్లాట్ లో, తల్లితో కలిసి ఎలా గృహప్రవేశం చేసింది? ఖరీదైన కార్లలో తిరగడానికి, ఆ ఫ్లాట్ కొనడానికి డబ్బులెలా వచ్చాయో ఏంటో విమలా నీకే తెలియాలి.

ప్రజలు ఇప్పుడు నీ వ్యవహారం మొత్తం గమనిస్తున్నారు..నీ సంగతులు తెలిసిన వారు ఇప్పుడు బయటపెట్టే పనిలో ఉన్నారని..తాను కూడా మరిన్ని లీక్స్ ఇవ్వబోతున్నానని..కాకపోతే అవి  నచ్చినప్పుడు లీక్ చేస్తాను. ఎందుకంటే నా లీక్స్ నా ఇష్టం’’ అంటూ కరాటే కల్యాణి పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: