నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చిన సినిమా కృష్ణార్జున యుద్ధం. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. థియేట్రికల్ రైట్స్ దాదాపు 30 కోట్ల వరకు చేసిన ఈ సినిమా వారంలో కేవలం 14 కోట్లను మాత్రమే రాబట్టగలిగింది.


ఈ లెక్కన చూస్తే నానిని ఈ సినిమా మళ్లీ మూడేళ్లు వెనక్కి నెట్టేసిందని చెప్పొచ్చు. భలే భలే మగాడివోయ్ సినిమా నుండి ఎం.సి.ఏ వరకు నాని సినిమా అంటే సూపర్ హిట్ అన్న టాక్ వచ్చింది. ప్రతి సినిమా దాదాపుగా 25 నుండి 30 కోట్ల దాకా వసూళ్లను రాబట్టాయి. కాని కృష్ణార్జున యుద్ధం మాత్రం ఆ రేసులో వెనుక పడింది.


వారం రోజులకు 14 కోట్లు.. ఇక ఈ వారం భరత్ అనే నేను వచ్చేసింది కాబట్టి ఇక నాని సినిమా వసూళ్లు రగ్గక తప్పదు. మా అంటే మరో 2,3 కోట్లు వస్తాయి. ఈ లెక్కన చూస్తే నాని ఉన్న ఫాం కు కృష్ణార్జున యుద్ధం ఫ్లాప్ గా నిలిచిందని చెప్పొచ్చు. నాని వరుస సక్సెస్ లకు బ్రేక్ వేస్తూ ఈ సినిమా షాక్ ఇచ్చింది.


అందుకే రొటీన్ గా కాకుండా కాస్త కొత్తగా ట్రై చేస్తే బెటర్ అని అంటున్నారు. ప్రస్తుతం శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్న నాని ఆ తర్వాత విక్రం కె కుమార్ తో సినిమా చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికి నాని మళ్లీ కెరియర్ లో మళ్లీ జాగ్రత్త పడాల్సిన పరిస్థితి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: