సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు తర్వాత అదే రేంజ్ లో వచ్చిన సినిమా భరత్ అనే నేను. సినిమాలో మహేష్ సిఎంగా నటించి మెప్పించాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సినిమాపై సెలబ్రిటీస్ కూడా తమ రెస్పాన్స్ తెలుపుతున్నారు.


ముఖ్యంగా మంచి సినిమా వస్తే ముందుంటే దర్శకధీరుడు రాజమౌళి భరత్ అనే నేను సినిమా గురిచి స్పందించాడు. సినిమా చూసిన రాజమౌళి.. లోకల్ గవర్నెన్స్ ను ఓ కమర్షియల్ సినిమాలో చూపించిన తీరు అద్భుతమని అన్నాడు. మహేష్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. ప్రెస్ మీట్ ఎపిసోడ్ బాగా నచ్చిందని అన్నారు జక్కన్న. 


సినిమా నిర్మాత డివివి దానయ్య కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఇలాంటి కథను సినిమా తీసినందుకు కొరటాల శివకు కంగ్రాట్స్ చెప్పారు. మొత్తానికి రాజమౌళి ట్వీట్ తో భరత్ టీం లో మరింత ఉత్సాహం వచ్చింది. సినిమా సూపర్ హిట్ టాక్ రావడమే కాదు యూఎస్ లో భారీ వసూళ్లను కూడా రాబడుతుండంతో మహేష్ కెరియర్ లో భరత్ అనే నేను మరో భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుందని అంటున్నారు.


డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా బాగున్నాయి. మహేష్ వన్ మ్యాన్ షోతో వచ్చిన ఈ సిఎం భరత్ చార్జ్ అందరికి నచ్చేసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: