ఒకవ్యక్తి మరోవ్యక్తిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తుంటే ఆవ్యక్తికి అవతలి వ్యక్తి పై విపరీతమైన పగ అయినా ఉండాలి లేదంటే కామెంట్స్ చేసే వ్యక్తికి బయటపడని మానసిక సమస్యలు ఉండి ఉండాలి అని చాలామంది మానసిక శాస్త్రవేత్తలు చెపుతూ ఉంటారు. ఇప్పుడు వర్మ పవన్ ల మధ్య జరుగుతున్న వార్ లో ఉన్న బయటపడని కోణాలు ఏమిటి అన్నవిషయమై చర్చలు జరుగుతున్నాయి. వర్మ టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రోజులలో కూడ మెగా ఫ్యామిలీతో సినిమాలు చేయాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. 
సంబంధిత చిత్రం
చాలసంవత్సరాల క్రితం చిరంజీవితో ఒక సినిమాను మొదలుపెట్టి కేవలం పదిరోజులు షూటింగ్ చేసి ఆసినిమాను ఆపేశాడు వర్మ. అదేవిధంగా కొన్నిసంవత్సరాల క్రితం వర్మ పవన్ కు ఒక కథను చెప్పినప్పుడు పవన్ వర్మను చిన్నబుచ్చే విధంగా ప్రవర్తించాడన్న గాసిప్పులు కూడ ఉన్నాయి.
RAM GOPAl varma latest photos కోసం చిత్ర ఫలితం
దీనితో అసహనానికి లోనైన వర్మ అవకాశం దొరికినప్పుడల్లా మెగాహీరోలను ముఖ్యంగా చిరంజీవి పవన్ లను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా వర్మ తాను 20సార్లు క్షమార్పణలు చెప్పినా పవన్ మనసుకరగని నేపధ్యంలో పవన్ పై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయను అంటూ తన తల్లి పై వేసిన ఒట్టును గట్టు మీదపెట్టి తిరిగి యూటర్న్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 
RAM GOPAl varma latest photos కోసం చిత్ర ఫలితం
"నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్ చేయనని మా అమ్మ మీద ఒట్టేశాను. ఆ తర్వాత కూడా నేను.. బాబు, లోకేష్, శ్రీనిరాజు, ఆర్కే, రవిప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన నా తల్లి అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నాను." అంటూ వర్మ తాజా ట్వీట్ చేసాడు. ఇప్పుడు ఈ లేటెస్ట్ ట్వీట్ తో వర్మ పవన్ పై మరిన్ని నెగెటివ్ ట్వీట్స్ పెడతానని పరోక్షంగా చెపుతున్నట్లు అయింది. ఇదే సందర్భంలో పవన్ నిన్న తన ‘జనసేన’ కార్యాలయంలో అత్యంత ఆవేశంగా తన లాయర్లతో భేటీ అయిన వీడియో దృశ్యాల పై స్పందిస్తూ వర్మ విలక్షణ వ్యాఖ్యలు పోస్ట్ చేసాడు. "వావ్ లాయర్ల కంటే క్లయింట్ ఎక్కువగా మాట్లాడ్డం ఫస్ట్ టైం చూస్తున్నాను. తన వద్ద ఉన్న డబ్బుతో పవన్ మంచి లాయర్లను పెట్టుకోవచ్చు కదా. వీళ్లంతా ప్రొడక్షన్ కంపెనీ నుంచి లాయర్ కోట్లు తెచ్చి వేసుకున్న పవన్ ఫ్యాన్స్ లా ఉన్నారు." దీనితో పవన్ వర్మల మధ్య ఈ ట్విటర్ వార్ మరికొన్ని రోజులు ‘హాట్ హాట్’ గా కొనసాగే ఆస్కారం ఉంది అని అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: