సూపర్ స్టార్ మహేష్ రెండు వరుస డిజాస్టర్ల తర్వాత కొరటాల శివతో కచ్చితంగా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో చేసిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు.


డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా కైరా అద్వాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. భరత్ అనే నేను యూఎస్ లో అత్యధికంగా 2000 ల ప్రీమియర్ షోస్ వేయడం జరిగింది. ఇక ఏపి, తెలంగాణాలో కూడా వసూళ్ల హవా కొనసాగుతుంది.


ప్రస్తుతానికి భరత్ అనే నేను ఏపి/తెలంగాణా వసూళ్ల లెక్కలు మాత్రమే బయటకు వచ్చాయి. మొదటి రోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో భరత్ ఏకంగా 21.94 కోట్ల షేర్ కలెక్ట్ చేశాడు. నైజాం లో 4.47 కోట్ల మొదటి రోజు వసూళ్లతో భరత్ బీభత్సం సృష్టించాడు. సిఎం గా మహేష్ అద్భుతమైన నటంతో ఆకట్టుకున్నాడు.


సినిమాలో హైలెటెడ్ గా చెప్పుకునే ప్రెస్ మీట్ సీన్ సినిమా రేంజ్ పెంచింది. మొత్తానికి మహేష్ సిఎంగా భరత్ అనే నేను సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి సినిమా చేస్తాడని తెలిసిందే. భరత్ హిట్ తో మహేష్ మరోసారి బాక్సాఫీస్ పై తన సత్తా చాటుతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: