‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ టివి9 అధినేత రవి ప్రకాష్ ను ఎబిఎన్ అధినేత రాధకృష్ణను టార్గెట్ చేస్తూ నిన్న మరింత ఘాటైన కామెంట్స్ తన ట్విటర్ లో చేయడంతో పవన్ కొన్ని ప్రముఖ మీడియా సంస్థల పై చేస్తున్న వార్ మరింత ముదిరింది. ‘రవి ప్రకాశ్.. నేను మీకు ప్రత్యేకంగా ఓ మెసేజ్ పంపుతాను. కొద్ది సమయం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. నా సందేశం కోసం మీరు వేచి చూడాల్సిందే. మిమ్మల్ని వెయిటింగ్‌లో పెట్టినందుకు క్షమించండి’ అని ట్వీట్ చేశాడు.
ప్యాంటు తడిచిపోవాలి
ఇంతటితో ఆగకుండా టీవీ9 ప్రసారాలను చూడవద్దు అని పిలుపు ఇచ్చిన పవన్ ఏకంగా టివి9 రవి ప్రకాష్ భార్యకు ఒక షాకింగ్ మెసేజ్ పెట్టాడు. ‘రవి ప్రకాశ్ భార్య గారికి నమస్కారాలు. మీ భర్త మంచి వ్యక్తే అమ్మ. కానీ మీ పిల్లల్ని టీవీ9 చూడకుండా దూరంగా పెట్టండి. నేను ఇలా సూచించినందుకు మీ పిల్లలు ఎందుకని ప్రశ్నించవచ్చు. అందుకు ఈ వీడియోను చూపించండి’ అంటూ మరో షాకింగ్ ట్విట్ పెట్టాడు పవన్. 
నాకు ఎవరితో గొడవలు లేవు
అదేవిధంగా టివి9 అధినేత శ్రీనిరాజుకు ఓ వీడియోను ట్యాగ్ చేసి పవన్ చురకలంటించాడు. ‘ఈ వీడియోను మీ తల్లికి, భార్యకు, చెల్లెలికి చూపించండి. అంతేకాకుండా ఆ వీడియో ద్వారా సాధించిన విజయాన్ని వారికి వివరించండి. కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి ఎలాంటి పనులు చేస్తున్నారో కూడా తెలియజేయండి’ అంటూ పవన్ తన ఆవేశాన్ని ఆగ్రహాన్ని వెళ్ళగక్కాడు. 
నేనెలా బాధ్యుడిని అవుతా
ఇదే సందర్భంలో ఎబిఎన్ రాధాకృష్ణకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ మరో ట్విట్ పెట్టాడు. ‘ఒపెన్ హార్ట్ ఆర్కే.. మీ టీడీపీ డ్రీమ్ టీమ్ చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియోను ఒకటి పంపుతున్నాను. నా తల్లిని దూషించే ఆ వీడియోను లోకేష్ స్నేహితులకు, సీఎం చంద్రబాబు, ఇంటి సభ్యులకు చూపించండి. అలాగే వారి అభిప్రాయాలను సేకరించి వాటిని ప్రసారం చేయండి’ అని పవన్ చురకలు వేసాడు. ఇప్పటికే పవన్ ఈ రెండు మీడియా సంస్థల పై ధీర్ఘకాలిక పోరాటాన్ని చేయబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ ఈ రెండు మీడియా సంస్థలు తన పై పన్నిన కుట్రకు సంబంధించిన వీడియో సంభాషణల ఆధారాలు ఉన్నాయి అని అంటున్నాడు పవన్. మరి ఈ యుద్ధం మరింత పెరగకుండా పవన్ మరియు ఈ ప్రముఖ ఛానల్స్ యాజమాన్యాల మధ్య ఒక రాజీ కుదర్చాలని తెలుగు మీడియా రంగంలో అత్యంత ప్రముఖంగా పేరుగాంచిన ఒక ప్రముఖ వ్యక్తి ప్రయత్నాలు ప్రారంభించినట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: