దేవదాసు సినిమాతో పరిచయం అయిన గోవా బ్యూటీ ఇలియానా తన నడుం వొంపులతో అప్పట్లో కుర్రకారుకి సెగలు రేపింది.  వరుస హిట్స్ తో అగ్రహీరోల సరసన నటించిన ఇలియానా తక్కువ  సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించింది.  వరుసగా హిట్స్ రావడంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది.  దాంతో ఇలియానా కన్ను బాలీవుడ్ పై పడింది..అంతే  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకటీ రెండు సినిమాలు తప్ప అక్కడ పెద్దగా హిట్స్ రాకపోవడంతో తిరిగి తెలుగు లోకి ఎంట్రీ ఇవ్వాలని చూసింది..కానీ అప్పటికే తెలుగులో అనుష్క, తమన్నా,రకూల్, రెజీనా, రాశీఖన్నా ఫామ్ లోకి వచ్చారు. 
ileana
దాంతో ఇటు తెలుగు అటు హిందీలో ఏ చాన్స్ లేకుండా ఖాళీగా ఉండాల్సి వచ్చింది.  అప్పుడప్పుడు హాట్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ..ప్రయత్నాలు మొదలు పెట్టింది.  ఈ మద్య అజయ్ దేవగాన్ నటించిన రైడ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది.  ఇక ఇలియానా ఫారిన్ కుర్రోడు ఆండ్రూ నీబోన్ ప్రేమించి పెళ్లిచేసుకుంది.  ఈ మద్య ఇలియానా గర్భవతి అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేస్తువచ్చాయి.
Image result for ileana d'cruz
దీనిపై స్పందించిన గోవా బ్యూటీ..ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పింది. తాను గర్భవతిని కాందంటూ శనివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నది. ఓ ఫొటోను పోస్ట్ చేసిన ఇలియానా ఆండ్రూ నీబోన్ తీశారని చెప్పింది. అయితే ఆండ్రూతో ప్రేమాయణం, పెళ్లి వార్తలపై ఇప్పటివరకు పెదవివిప్పలేదు ఇలియానా. వ్యక్తిగత విషయాల్ని పంచుకోవడం తనకు ఇష్టం ఉండదంటూ బదులిస్తూ వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: