బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా టెలివిజన్ ప్రజానీకానికి సుపరిచితుడయినా పవన్ ఫ్యాన్స్ తో జరిగిన వివాదంతో తెలుగు రాష్ట్రాలలో అందరికీ పరిచయస్తుడయ్యాడు కత్తి మహేష్. స్వయానా సినీ విమర్శకుడు  అవడంతో విడుదలయిన ప్రతీ సినిమాకు తనకు నచ్చినట్లుగా రివ్యూ రాసి వివాదాన్ని సృష్టిస్తుంటాడు. అందుకే కత్తి ఇచ్చే రివ్యూలపై చాలా మంది ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు .


కాగా మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల విడుదలయిన చిత్రం భరత్ అనే నేను. రాజకీయ నేపథ్యంలో విడుదలయిన ఈ సినిమా వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం కొన‌సాగిస్తోంది. సినిమా విడుదలయిన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావ‌డం అందులోనూ సమ్మర్ సీజన్ అవడంతో కలెక్షన్ల పరంగా ఎక్కడా తగ్గడంలేదు. కొరటాల కథకు మహేష్ యాక్టింగ్ తోడవటంతో సినిమా ఓ రేంజిలో ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాజమౌళి సైతం సినిమా, మహేష్ యాక్టింగ్ బాగుందని ట్విట్టర్లో స్పందించాడు.


అయితే సినిమాలో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నా కత్తి మహేష్ పూర్తి నెగటివ్ గా రివ్యూ ఇవ్వడం మహేష్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ- "భరత్ అనే నేను ఒక అతి సాధారణ సినిమా. ఈ సినిమాలోని కథ మరియు స్క్రీన్ ప్లే మిమ్మల్ని 1990 లోకి తీసుకెళ్తాయి. ఇది స్పష్టమైన కమర్షియల్ సినిమా. మహేష్ యెక్క యాక్టింగ్ తో పోల్చితే మిగితావాళ్ళ నటన సాధారణంగా ఉంది. ఈ సినిమాని ఒక్కసారి మాత్రమే చూడగలం" అంటూ రాసుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: