అల్లు అరవింద్ కొడుకుగా విపరీతమైన సపోర్ట్ ఉన్నా శిరీష్ యంగ్ హీరోగా పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఇతడు నటిస్తున్న సినిమా కథలు డిఫరెంట్ గా ఉన్నా ఆర్ధికంగా ఆసినిమాలు చెప్పుకోతగ్గ విజయాలు సాధించలేకపోవడంతో శిరీష్ కోరుకునే స్థాయిలో టాప్ డైరెక్టర్స్ ఎవ్వరు శిరీష్ వైపు చూడటం లేదు.
సంబంధిత చిత్రం
దీనితో తన అభిమానులు తనను మరిచిపోకుండా ఉండేందుకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేకమంది హీరోయిన్స్ పై జోక్స్ లాంటి కామెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు శిరీష్. ఇలాంటి పరిస్థుతులలో శిరీష్ రకుల్ ప్రీత్ కు విషెస్ చెపుతూ పెట్టిన ట్విట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఐరన్ లెగ్ బ్యూటీగా పేరు రావడంతో రకుల్ తన రూట్ మార్చి కోలీవుడ్ బాట పట్టి అక్కడ భారీ అవకాశాలు పట్టేస్తోంది.  
RAKUL PREETH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈమె కార్తీ సూర్య శివ కార్తీకేయన్ లాంటి టాప్ హీరోలతో ఈమె కోలీవుడ్ లో నటిస్తోంది.  కోలీవుడ్ లో నెలన్నరపాటు సాగిన సమ్మె ఎట్టకేలకు ముగియడంతో చాలారోజుల తర్వాత షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. తమిళ క్రియేటివ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ‘ఎన్.జీ.కె’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రకుల్ తన సంతోషాన్ని బయటపెడుతూ ‘టడా.... షూటింగ్ డే 1’ అంటూ ట్వీట్ చేసింది. దానికి అల్లు వారబ్బాయి శిరీష్ స్పందిస్తూ ‘నిన్ను చూస్తే నాకు జెలస్ గా ఉంది. నా అభిమాన హీరోతో కలిసి నటిస్తున్నావ్’ అంటూ రీ ట్విట్ చేసాడు. 
ALLU SIRISH LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈ ట్విట్ ను చూసిన చాలామంది టాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్ లో అవకాశాలు పొందుతున్న రకుల్ ప్రీత్ సమర్ధత తనకు రాలేదే అని బాధపడుతూ శిరీష్ జెలసీ తో ఈ ట్విట్ ను చేసాడు అంటూ కొందరు శిరీష్ పై జోక్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కనీసం శిరీష్ కు కోలీవుడ్ లో అయినా రకుల్ అవకాశాలు ఇప్పిస్తుందేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: