మహేష్ భరత్ అనే నేను ఊహించిన విధంగానే బాక్సాఫీస్ మీద తన ప్రతాపం చూపిస్తుంది. ఏప్రిల్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ తోనే 1.4 మిలియన్ వసూళ్లను రాబట్టగా రెండో రోజు కూడా అదే దూకుడుతో ఏకంగా 2 మిలియన్ మార్క్ ను అందుకుంది. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా మహేష్ అదరగొట్టాడు.  


బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల తర్వాత మహేష్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ భరత్ వచ్చింది. మంచి కథ కథనాలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ సినిమా. ఇక మహేష్ తన నటనతో మరోసారి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.  


ఓవర్సీస్ లో మహేష్ సినిమా లెక్కలు వేరేలా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన సినిమాలు కూడా అక్కడ సూపర్ కలక్షన్స్ తెచ్చుకుంటాయి. ఈ విధంగా చూస్తే మహేష్ భరత్ అనే నేను కూడా ఓవర్సీస్ లో ఇప్పటికే 2 మిలియన్ మార్క్ అందుకుంది. శ్రీమంతుడు తర్వాత వచ్చిన సినిమాగా మళ్లీ ఆ హిట్ మేనియాను కొనసాగించింది భరత్ అనే నేను.


బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తనకు తెలుగులో డెబ్యూ మూవీ కాగా ఈ సినిమాతో అమ్మడి హిట్ అందుకుని తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఓవరాల్ గా మహేష్ స్టామినా చూపించేలా భరత్ కలక్షన్ల బీభత్సం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: