రామ్ చరణ్ కు సంబంధించిన అనేక వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా లీక్ చేస్తూ ఉపాసన చరణ్ ను అతడి అభిమానులకు మరింత దగ్గరకు చేర్చడానికి అనునిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ‘రంగస్థలం’ సూపర్ సక్సస్ ఆనందాలను చాలరోజులు ఎంజాయ్ చేసిన తరువాత రామ్ చరణ్ తను లేటెస్ట్ గా నటిస్తున్న బోయపాటి సినిమా పై దృష్టి పెట్టాడు. 

ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ప్రారంభం అయి రెండు షెడ్యూల్స్ పూర్తి అయిపోయినా చరణ్ ‘రంగస్థలం’ హడావిడిలో ఉండటంతో ఈమూవీ షూటింగ్ అనేక సార్లు వాయిదా పడింది. ఇక లాభం లేదనుకుని చరణ్ తన మూడ్ ను మార్చుకుని మండే ఎండలను కూడ లెక్క చేయకుండా ఈరోజు నుండి బోయపాటి షూటింగ్ స్పాట్ కు వెళ్ళాడు చరణ్. 
బోయపాటి మాస్ మసాలా
చరణ్ సినిమా షూటింగ్ కు బయలుదేరే ముందు ఇంట్లో పూజచేసుకుని బయలుదేరడం అలవాటు కాబట్టి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు చరణ్ తన దైవారాదన ముగించుకుని షూటింగ్ కు వెళ్ళుతున్న సందర్భంలోని ఫోటోను ఉపాసన సోషల్ మీడియాకు లీక్ చేసింది. బోయపాటి దర్శకత్వంలో యాక్షన్ చిత్రాల తరహాలో ఉండబోయే ఈమూవీలో రామ్ చరణ్ పాత్రను చాల ధీటుగా బోయపాటి మలిచినట్లు టాక్. 
VIVEK OBRAI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న నేపధ్యంలో అతడి విలన్ పాత్రను చాల డిఫరెంట్ గా స్టైలిష్ గా బోయపాటి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ ‘భరత్’ తో సూపర్ సక్సస్ అందుకున్న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా ఈమూవీలో నటిస్తోంది. దీనికితోడు ఒకనాటి గ్లామర్ హీరోయిన్ స్నేహ ఈ మూవీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ‘రంగస్థలం’ సక్సస్ ట్రాక్ ను కొనసాగించాలి అన్న పట్టుదలతో తీస్తున్న ఈసినిమా విషయంలో దర్శకుడు బోయపాటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: