అదృష్టానికి మారుపేరు కైరా అద్వాని. ఏ హీరొయిన్ కైనా "టాలీవుడ్ డెబ్యు మూవీ" యే బ్లాక్-బస్టర్ కావడం అంటే అదృష్టం తరుముకుంటూ రావటమే. అంతటి అందలం అందరికి అందదు. కొన్ని సినిమాలు చేశాకే "ఇండస్ట్రీ హిట్" ఆమె అకౌంట్ లో పడుతుంది. కాని కైరా అద్వాని అదృష్టం మామూలుగా లేదు. మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో జంటగా నటించే అవకాశం దొరకటం.
Related image
ఈ సినిమాకు ముందు ఆమె ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. ఇంతకు ముందు ఆమె మహేంద్ర సింగ్ "ధోనీ" బయోపిక్‌ లో ధోనీ భార్య పాత్రలో నటించింది. ఒక బయోపిక్‌ లో నిజ జీవితపాత్రను చేసి మెప్పించిందంటే నటిగా ఆమె సత్తా ఋజువైందన్నమాటే. అలాంటి సత్తానే మరోసారి భరత్ అనే నేను లో ప్రదర్శించింది. కియరా అద్వాని. టాలీవుడ్ తొలి సినిమా తోనే లోనే మహేష్ బాబు వంటి స్టార్ హీరోకు జంట గా నటించే అవకాశం సంపాదించిన ఈ భామ ఆ అవకాశాన్ని పూర్తిగా సద్విని యోగం చేసుకుంది. 
 
ఆ సినిమా కాస్త రికార్డులు బ్రేక్ చేస్తూ వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే ₹100 కోట్ల గ్రాస్స్ వసూళ్ళు అంటే అనితర సాధ్యం ప్రస్తుతానికి. అలాగే ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే రామ్ చరణ్ - బోయపాటి క్రేజీ కాంబోలో మరో అవకాశం. ఇప్పుడు ఇది చాలదు అన్నట్టు రాజమౌళి మల్టీ స్టారర్ కోసం డివివి దానయ్య తననే ఎంపిక చేసినట్టు వచ్చిన సమాచారం. ఇదే నిజమైతే ఇంత కన్నా లక్కీ-గర్ల్ ఉంటారా! అనిపిస్తుంది. 
Image result for kiara advani in full saree
మొత్తం మూడు సినిమాలకు డివివి దానయ్య తన సినిమాలకు కథానాయకిగా ఒక "ప్రత్యేక ప్యాకేజీ" మాట్లాడుకున్నట్టు సమాచారం. భరత్ అనే నేను....లో కైయిరా "లుక్స్ & యాక్టింగ్ కు నూటికి నూరు మార్క్స్ పడ్డాయి. ఎక్స్‌ప్రెషన్స్‌ అద్భుతం. హీరో వల్లో చటుక్కున పడిపోయే అతిసాధారణ రొటీన్ హీరోయిన్ పాత్రే. అయితేనేం, అందులో కూడా నటించడానికి ఎంతో కొంత అవకాశం దక్కించుకుంది, ఆ చిన్న అవకాశాన్ని అద్భుతంగా మలుచుకొని మహోన్నతంగా ఆకట్టుకుంది. ఆ విషయంలోనే కియరా తన ప్రతిభ చూపి అన్ దులో సక్సెస్ అయ్యింది. ప్రేమ సన్నివేశాల్లో ఈమె నటన మధురంగా ఆకట్టుకుంటుంది. ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదనుకుంటున్న దశలో ఈమె పాత్ర వల్లనే కథ మలుపు తిరుగుతుంది. 
kiara advani not in ban just to romance
హీరోకి దూరమయ్యే సన్నివేశాలను పండించి వంద శాతం న్యాయం చేసింది. అసమాన ప్రఙ్జా పాటవాలు ప్రదర్శించి అదృష్టాన్ని కూడా అందలమెక్కించింది. తాజాగా చెప్పాలంటే టాలీవుడ్‌ లో హీరోయిన్ల కొరత నడుస్తోంది. కొంతమంది హీరోయిన్లు యువ హీరోల సరసన సెట్ కావడం లేదు. మొన్నటి వరకూ పరుగులో ముందున్న  రకుల్ ప్రీత్ సింగ్ ఈ మద్య వైఫల్యాలతో వెనుకబడింది. ఇలాంటి పరిస్థితుల నడుమ కియరా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది.
Image result for kiara advani in full saree
కయిరా టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీతోనే తంతే గార్లె బుట్టలో పడేసినట్లు కాలం కూడా ఆమెను "గోల్డెన్ పీరియడ్" లోకి తోసేసింది. అసలే ఇప్పుదున్న ముదురు భామలు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తున్నారు. కొత్తదనం కోరుకుంటున్న వాళ్ళు కయిరా అద్వాని లాంటి అందగత్తెలకు ఆహ్వానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 
Image result for bharat ane nenu kaira with mahesh
పూజాహెగ్డే ఇలాగే ఆఫర్స్ మీద ఆఫర్స్ తో ఒకపక్క ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా రానున్న రోజుల్లో కయిరా అద్వాని టాలీవుడ్ కు "బెస్ట్-ఛాయస్"గా మారే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. బాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాక వేచి చూసిన కయిరా, దక్షిణాది తనను ఒక రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేయటానికి యాక్సెప్ట్ చేయటం పట్ల చాలా ఖుషీగా ఉంది. 
Image result for bharat ane nenu kaira with mahesh
మరి రాజమౌళి సినిమాలో చరణ్ పక్కన జోడిగా ఉంటుందా? లేక ఎన్టీఆర్ పక్కన స్క్రీన్ పంచుకున్టుందా? అంటే సమాధానం సింపుల్. ఇప్పుడు బోయపాటి సినిమాలో చరణ్ పక్కన ఆల్రెడీ చేస్తోంది కనక. జస్ట్, 'ఫర్ ఎ చేంజ్' యంగ్ టైగర్ పక్కన చిందులేసే చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Image result for kaira with young tiger

మరింత సమాచారం తెలుసుకోండి: