పవన్ కళ్యాణ్ టీవీ9 ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై చేస్తున్న ట్విట్టర్ వార్ లో ఒక ఊహించని టర్న్ తీసుకున్నాడు. తనను విమర్శిస్తున్న మీడియా సంస్థలు అదేవిధంగా వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఒక కార్యక్రమానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు స్వయంగా పవన్ ట్విట్ చేయడం సంచలనంగా మారింది.  త్వరలో తన అభిమానుల కోసం ‘అరె ఓ సాంబ!! హుకుం సర్దార్!!’ ప్రోగ్రాం ముందుకు రాబోతోంది అంటూ పవన్ లీకులు ఇచ్చాడు.  ఈ కార్యక్రమంలో కొందరి ప్రముఖ వ్యక్తుల వ్యక్తిగత జీవితాల పై చాట్స్, గాసిప్స్, ఫొటోలు, వీడియోలు ఉంటాయట. 
పవన్ కళ్యాణ్ లాంటి వాడు వస్తే వేషాలు సాగవని
దీనితో ఈకార్యక్రమం గురించి పవన్ అభిమానులు ఎదురు చూస్తుంటే ఒక బాధ్యత గలిగిన రాజకీయ పార్టీ నేతగా ఇలాంటి చౌకబారు కార్యక్రమాలను పవన్ ఎందుకు రూపకల్పన చేస్తున్నాడు అంటూ అప్పుడే విమర్శలు మొదలైపోయాయి.  ఇది ఇలా ఉండగా పవన్ టివి9 ర‌విప్ర‌కాశ్ కు సంబంధించి లీక్ చేసిన  వీడియో, ఫొటోలు పై కూడ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 
 పవన్ రావొద్దని కోరుకునే వారు అలా చేస్తున్నారు
టీవీ9 రవిప్రకాశ్ కాళ్లను ఓ వ్యక్తి పట్టుకున్న వీడియోను పవన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూడ విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. ఆ వీడియో కొత్తదేమీ కాదని ఎప్పుడో ఐదేళ్ల క్రితం వ‌చ్చిన ఆ వేడియోను పవన్ ఎదో కొత్త విషయం బయట పెడుతున్నట్లుగా హడావిడి చేయడం చూస్తుంటే ప‌వ‌న్ ను ఎవ‌రో త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని చాలామంది భావించడమే కాకుండా ఈ విషయం పై వ‌ర్మ చాల ఘాటుగా పవన్ పై రివర్స్ పంచ్ లు వేసాడు. ఈ వీడియో ఇప్పటికే కొన్ని ల‌క్ష‌ల సార్లు షేర్ అయింద‌ని ఆ వీడియోను బయట  పెట్టమ‌ని ప‌వ‌న్ కు స‌ల‌హా ఇచ్చిన‌వారిని ప‌క్క‌పెట్ట‌మ‌ని ప‌వ‌న్ కు సూచిస్తున్నాడు వర్మ. 
అభ్యంతరాలు ఉంటే మాకు ఫిర్యాదు చేయండి
ప‌వ‌న్ ను పక్కదోవ పట్టిస్తున్న వెధవలను పక్కనపెట్టి వాస్తవాలను గ్రహించాల‌ని వర్మ సూచిస్తూ ``హే పవన్‌ కల్యాణ్‌ అది కొత్తేం కాదు ఐదేళ్ల క్రితం వీడియో లక్షలసార్లు సర్క్యూలేట్‌ అయ్యింది. ఆ వీడియోను చూస్తున్న చివ‌రి వ్య‌క్తి మీరే కావ‌చ్చు. ఆ వీడియో పెట్టమని నీకు సలహా ఇచ్చిన వెధవలను పక్కన పెట్టేయ్‌.’ అంటూ ట్విట్ చేశాడు వర్మ. పవన్ ఇలా వరస పెట్టి ఆవేశంతో చేస్తున్న ట్విట్స్ తో తన ఇమేజ్ ని పూర్తిగా కోల్పోతున్నాడు అంటూ కొందరు పవన్ అభిమానులు కూడ పరోక్షంగా అంగీకరిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ తన ఆవేశం తగ్గించుకుని ఆలోచన పెంచుకోకపోతే రాజకీయంగా పవన్ నష్టపోయే సూచనలు కనిపించడమే కాకుండా పవన్ ఇమేజ్ గ్రాఫ్ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: