తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) చాలా ఘోరంగా జరుగుతుందని..ముఖ్యంగా తెలుగు అమ్మాయిల విషయంలో ఎన్నో దారుణాలు జరిగిపోతున్నాయని ఇండస్ట్రీలో చిన్న నుంచి పెద్ద వరకు అమ్మాయిలను వాడుకోవాలనే చూస్తున్నారని..ఇప్పటికైనా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని నటి శ్రీరెడ్డి గత నెల రోజుల నుంచి ఎన్నో ఛానల్స్ లో మొర పెట్టుకుంది. ఆ మద్య ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి. 
Related image
ఇదిలా ఉంటే..శ్రీ రెడ్డి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో విషయం కాస్త సీరియస్ మ్యాటర్ అయ్యింది.  మరోవైను ఈ విషయంలో వర్మ జోక్యం చేసుకోవడం..పవన్ కళ్యాన్ ఆవేశంతో మా అసోసియేషన్ వద్ద కొన్ని మీడియా ఛానల్స్ పై ఫైర్ కావడం ఇలా ఎన్నో మలుపులు తిరిగింది. 
Image result for na peru surya na ellu india
అయితే శ్రీరెడ్డి అన్న విషయంపై మెగా హీరోలు ఆవేశంలో ఉన్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన మిలట్రీ మాధవరం గ్రామంలో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ... "ఈ రోజు పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడి వెళతాను.. నాకు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే.. నాకు బాగా మాట్లాడాలని అనిపించాలి. ఇండస్ట్రీలో ఆయన నెంబర్ వన్ హీరో కానీ ప్రజల కోసం ఎండలోకి వచ్చారు.

తన కెరీర్ కాదనుకొని ప్రజల బాగు కోసం ముందడుగు వేస్తున్నారు.  టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, మొన్న చాలా పర్సనల్‌గా మాట్లాడారు.. చాలా చాలా చాలా తప్పు.. మాట్లాడినోళ్లది తప్పు, మాట్లాడించినోళ్లది తప్పు, ఈ మాట లక్షల మందికి చూపించారు వాళ్లది పెద్ద తప్పు.. ఆ విషయం నాకు నచ్చలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: