సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కి ఈ నెల 20న రిలీజ్ అయిన భ‌ర‌త్ అనే నేను రికార్డుల మీద రికార్డులు కొల్ల‌గొడుతూ దూసుకుపోతోంది. రెండు రోజుల‌కే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ చిత్రం యూఎస్, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం బ్రహ్మాండమైన వసూళ్లను రాబడుతోంది. మ‌హేష్‌కు తిరుగులేని ప‌ట్టు ఉన్న ఓవ‌ర్సీస్‌లో అయితే కేవ‌లం రెండు రోజుల‌కే 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Image result for bharat ane nanu

ఇక ఈ సినిమా ఆస్ట్రేలియాలోనూ వ‌సూళ్ల దుమ్ము దులుపుతోంది. భ‌ర‌త్‌ను అక్క‌డ ఏకంగా 100 స్క్రీన్ల‌లో రిలీజ్ చేశారు. ఓ తెలుగు సినిమాకు ఈ రేంజ్‌లో స్క్రీన్లు వేయ‌డం ఫ‌స్ట్ టైం. దీంతో పాటు అక్క‌డ బుకింగ్‌ల‌తోనే ఈ సినిమా రికార్డులు కొల్ల‌గొట్టింది. మొదటిరోజు ఆస్ట్రేలియాలో 1.68 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను ఖాతాలో వేసుకున్న ఈ సినిమా శని, ఆదివారాల్లో కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చింది.

Image result for bharat ane nanu

శనివారం 1.16 లక్షలు, ఆదివారం 54,922 ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసి మొత్తంగా 3.39 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను అందుకుని ఓపెనింగ్స్ పరంగా సౌత్ ఇండియన్ సినిమాల్లో ‘బాహుబలి’ తర్వాతి ప్లేస్‌లో ఛాన్స్ కొట్టేసింది. ఇక గ‌త నెల చివ‌ర్లో రిలీజ్ అయిన రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం అక్క‌డ 2.89 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లను వసూలు చేసి మూడవ స్థానంలో కొనసాగుతోంది. 

Image result for bharat ane nanu

ఇక అమెరికాలో ఇప్ప‌టికే 2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసిన ఈ సినిమా త్వ‌ర‌లోనే 3 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను సులువుగానే క్రాస్ చేసేయ‌నుంది. సినిమాకు టాక్ బాగుండ‌డంతో ఎలాంటి ఆఫ‌ర్లు లేకుండానే అక్క‌డ టాప్ వ‌సూళ్లు కొల్ల‌గొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: