కెరియర్ మొదట్లోనే స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడటం స్టార్ వారసులకే అవుతుంది. కాని కేవలం ఒక సినిమాతోనే ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో ఫ్రెండ్ గా కనిపించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ద్వారక పోయినా సరే అర్జున్ రెడ్డితో అదిరే హిట్ అందుకున్నాడు.


సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా చిన్న సినిమాల్లో సంచలన విజయం అందుకుంది. 4 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా దాదాపు 30 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వల్ చేసే ఆలోచనలో ఉన్నాడట సందీప్ వంగ. హీరో విజయ్ కూడా అందుకు ఓకే చెప్పడంతో కథ రాయడం మొదలు పెట్టాడట.


అసలైతే సందీప్ వంగ మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. సుకుమార్ సినిమాకు ముందు అర్జున్ రెడ్డి డైరక్టర్ కే ఓకే చెప్పాడు మహేష్ కాని ఇంతలో ఏమైందో ఏమో కాని సుకుమార్ తోనే మహేష్ తన 26వ సినిమా ఎనౌన్స్ చేశాడు. అందుకే విజయ్ తో అర్జున్ రెడ్డి-2 ఫిక్స్ చేసుకున్నాడు సందీప్ వంగ. 


40 ఏళ్ల తర్వాత అర్జున్ రెడ్డి పాత్ర ఎలా ఉంటుందనే కథతో అర్జున్ రెడ్డి సినిమాకు కొనసాగింపుగానే ఈ సినిమా వస్తుందట. అందులోని పాత్రలే ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది. మరి మరోసారి అర్జున్ రెడ్డి మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి. అర్జున్ రెడ్డి సినిమా మాత్రం ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే తమిళంలో వర్మగా ఈ సినిమా తెరకెక్కుతుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: