ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని అలరించి వేలాది కోట్ల రూపాలు వసూలు చేసింది 'హారీ పొట్టర్' సీరిస్ సినిమాల్లో ప‌్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు వెర్నెట్రోయ‌ర్ మ‌ర‌ణించారు.   హ్యారీ పొట్టర్ సిరిస్ పుస్తకాలను ఆధారంగా గ్రాఫిక్ మాయాజాలన్ని సృష్టించారు. ఇక హ్యారీపొట్ట‌ర్ సిరీస్‌లో `గొబ్లిన్ గ్రిప్‌హుక్‌` పాత్రలో చిర‌స్మ‌ర‌ణీయ న‌టను ప్ర‌ద‌ర్శించారు.
Image result for harry potter actor verne troyer passes away
హ్యారీపొట్ట‌ర్‌తో పాటు ఆస్టిన్ ప‌వ‌ర్ మూవీ సిరీస్‌లు కూడా ఆయ‌న‌కు పేరు తెచ్చి పెట్టాయి. గత కొంత కాలంగా  వెర్నెట్రోయ‌ర్ అనారోగ్యంతో బాధపడటమే కాకుండా మానసికంగా కూడా కుంగిపోయి ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు.
Image result for harry potter actor verne troyer passes away
ఈ నేపథ్యంలో లాస్ ఏంజెలిస్‌లోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ వెర్నె ట్రోయ‌ర్ మ‌ర‌ణించారు.  కాగా, ఆయ‌న మ‌ర‌ణించ‌డానికి కార‌ణం స్ప‌ష్టంగా తెలియ‌రావ‌ట్లేదు. వెర్నె మృతిపై కుటుంబ స‌భ్యులు కూడా ఎలాంటి కార‌ణాన్నీ వెల్ల‌డించ‌ట్లేదు. డిప్రెష‌న్ వ‌ల్ల ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డి ఉండొచ్చ‌ని ప్రాథ‌మిక స‌మాచారం.

కేవ‌లం 2 అడుగుల 8 అంగుళాల ఎత్తు మాత్ర‌మే ఉండే వెర్నెట్రోయ‌ర్ ఇప్పటి వరకు పాతిక సినిమాలకు పైగా నటించారు. ఫియ‌ర్‌, లోథింగ్ ఇన్ లాస్‌వెగాస్‌, ద ల‌వ్ గురు, ద ఇమేజినేరియ‌మ్ ఆఫ్ డాక్ట‌ర్ ప‌ర్నాస‌స్ వంటి సినిమాలు వెర్నెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆస్టిన్ ప‌వ‌ర్‌, హ్యారీపొట్ట‌ర్ మూవీ సిరీస్‌ల‌తో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.   

కాగా, వెర్నెట్రోయ‌ర్  ఎందుకు డిప్రెష‌న్‌కు గుర‌య్యారు? ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు? లేక ఆయ‌న మ‌ర‌ణం స‌హ‌జ‌మైన‌దేనా? అనే ప్ర‌శ్న‌లు ఎన్నో త‌లెత్తుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: