టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అక్కినేని అఖిల్. కింగ్ నాగార్జున రెండవ తనయుడు అఖిల్ ‘సిసింద్రి’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చినా..మనం సినిమాలో కనిపించాడు.  ఆ తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అఖిల్ నటుడిగా మంచి మార్కులే కొట్టేసినా..సినిమా మాత్రం పెద్దగా హిట్ కాలేదు.  ఆ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ సినిమాలో నటించాడు. 
Image result for akhil shriya
అయితే అఖిల్ సినిమా తర్వాత తన చిన్ననాటి ఫ్రెండ్ ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాని తెగ హంగామా చేశాడు. అప్పటికే నాగ చైతన్య, సమంత ప్రేమకు పెద్దలు అంగీకరించారు..పనిలో పనిగా అఖిల్ ప్రేమకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగార్జున.  అంతే కాదు అఖిల్ తాను ప్రేమించిన  శ్రీయా భూపాల్ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కారణాల సంగతి పక్కన పెట్టేస్తే.. 2016 డిసెంబర్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ తరువాత అఖిల్-శ్రీయా భూపాల్ విడిపోయారు.

ఆ తరువాత అఖిల్ తన దృష్టిని సినిమాలపై పెట్టారు. సీన్ కట్ చేస్తే శ్రీయా భోపాల్ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన తమ్ముడు అనిందిత్ రెడ్డితో పెళ్లికి రెడీ అయ్యింది శ్రీయా భోపాల్. వీరి వివాహం నిశ్చితార్థం  హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.  ఈ నిశ్చితార్థ వేడుకుకు రామ్ చరణ్, ఉపాసనలు హాజరయ్యారు. అనిందిత్ రెడ్డి తల్లి సంగీత.. ఉపాసన తల్లి శోభన సొంత అక్కాచెల్లెల్లు.
Image result for anirudh reddy shriya
అంటే ఉపాసన, అనిందిత్ రెడ్డిలు అక్కాచెల్లెల్ల బిడ్డలు. ఈ లెక్కన ఉపాసన తమ్ముడైన అనిందిత్ రెడ్డి శ్రీయా భోపాల్‌ని వివాహమాడనున్నాడన్నమాట. ఇక అనిందిత్ వృత్తి పరంగా దేశీయ మోటార్ స్పోర్ట్స్ సర్కిల్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. పలు దేశీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదర్చుకుని మోటార్ రంగంలో రాణిస్తున్నారు. ఇక శ్రీయా భోపాల్ అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో పనిచేసి ఆ రంగంలో రాణిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: