తెలుగు ఇండస్ట్రీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే విధంగా బాహుబలి, బాహుబలి 2 చిత్రాలను తెరకెక్కించారు రాజమౌళి.  ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఎన్నో రికార్డుల మోత మోగించిన బాహుబలి, బాహుబలి2.  అంతే కాదు ఈ చిత్రంలో నటించిన నటీ నటులకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  బాహబలి ఫస్ట్ పార్ట్ లో అవంతిక గా దేవకన్యగా కనిపించింది.
Related image
ఆ తర్వాత వీర యోధురాలిగా కనిపించింది.  బాహుబలి 2 చిత్రంలో యుద్ద సన్నివేశాల్లో కనిపించింది. బాహుబలి సిరీస్ తమన్నాకు మంచి పేరు తీసుకురావడంతో బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి చాన్స్ లు వచ్చాయి.  తాజాగా ఈ అమ్మడికి మరో అదృష్టం కలిసి వచ్చింది.   మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ల ‘ సైరా నరసింహా రెడ్డి ‘ చిత్రంలో నటించే ఛాన్స్ తనకు వచ్చిందని ఆనందంతో పొంగిపోతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. 
Image result for saira narasimha reddy
ఈ సినిమాలో నాకు కీలక పాత్ర లభించింది. ఈ మధ్యే ఈ చిత్రానికి సైన్ చేశా అని తెలిపింది. బాహుబలిలాగే ఈ మూవీకూడా ఎన్నో భాషల్లో తెరకెక్కుతోందని, ముఖ్యంగా హిందీ మాట్లాడేవారు కూడా ఈ చిత్రాన్ని తప్పక ఆదరిస్తారని తమన్నా పేర్కొంది.సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల పారితోషికాల విషయంలో మెల్లగా అసమానతలు తగ్గుతున్నాయని మిల్కీ బ్యూటీ అభిప్రాయపడింది.
Image result for saira narasimha reddy
 ప్రస్తుతంనందమూరి కళ్యాణ్ రాం తో తను చేస్తున్న ‘ నా నువ్వే ‘ చిత్రంలో నటిస్తున్నట్లుగా..ఇందులోని ; చినికి..చినికి ‘ పాట తననెంతో ఎగ్జైట్ చేసిందని, చాలా కాలం తర్వాత లవ్ స్టోరీ చేస్తున్న తన రోల్ ని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉందని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: