భారతదేశంలో బిగ్ బాస్ ఎంత పాపులర్ అయిందో చెప్పనవసరంలేదు. బాలీవుడ్లో ప్రారంభమయిన ఈ షో ప్రాంతీయ భాషలకు సైతం పాకిందంటే ఈ షో ఎంతగా జనాలకు చేరువయ్యిందో అంచనా వేయవచ్చు. అయితే హిందీ బిగ్ బాస్ 11వ సీజన్లో విజేతగా నిలిచిన శిల్పా షిండే, అశ్లీల వీడియోలో నటించినట్లుగా తెలుపుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.


అయితే ఆ వీడియోలో ఉన్నది నేను కాదు బాబోయ్ అంటూ తన ఇంస్టాగ్రామ్ పేజీలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటో తన ఫ్యాన్ పంపించాడంటూ తెలిపింది. అయితే బిగ్ బాస్ బ్యూటీ షేర్ చేసిన ఫోటోకు నెటిజన్ల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. సామాజికమాధ్యమాల ద్వారా ఒక అశ్లీల కంటెంట్ ను ఎలా షేర్ చేస్తావంటూ నెటిజన్లు విరుచుకపడుతున్నారు.


ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ శిల్పాతో గొడవపడే, సౌత్ ఇండస్ట్రీలపై అనుచిత వాఖ్యలు చేసిన హీనా ఖాన్ కూడా అమెపై విమర్శలు గుప్పించింది. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నవారిని దేశం మొత్తం చూస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లోనే భాద్యత కలిగి ప్రవర్తించాలి. కానీ ఇలా చేయడం సరికాదంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. అయితే నేను చేసినది తప్పు అంటున్నవారు ఈ వీడియో వైరల్ అవుతున్నప్పుడు ఏం చేసారంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: