టాప్ హీరోలు అంతా తామొక్కటే అని పలుసార్లు సంకేతాలు ఇస్తున్నా టాప్ హీరోల అభిమానులు మాత్రం ఆమాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని చెప్పగలిగే ఒక ఆసక్తికర విషయం ‘భరత్ అనే నేను’ సక్సస్ తరువాత జరిగింది. రెండు ఘోర పరాజయాలు తరువాత మహేష్ కు సూపర్ సక్సస్ రావడం వెనుక జూనియర్ సెంటిమెంట్ బాగా పనిచేసింది అంటూ జూనియర్ అభిమానులు ఈమూవీ విజయం పై కామెంట్స్ చేస్తున్నారు.
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘భరత్’ కు ఎటువంటి నెగిటివ్ టాక్ జూనియర్ అభిమానుల నుండి రాకూడదు అన్న ఉద్దేశ్యంతో మహేష్ జూనియర్ ను ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా పిలవడం తెలిసిన విషయమే. ఇప్పుడు ఈవిషయాన్ని హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ మ్యాజిక్ టచ్ ‘భరత్’ కు కలిసివచ్చిందని చెపుతూ చాలామంది జూనియర్ అభిమానులు సోషల్ మీడియాలో ట్విట్స్ పెడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
వాస్తవానికి ‘భరత్’ సినిమా కథలో ఒక కొత్త అంశం ఉండటంతో ఆ కంటెంట్ కు ప్రేక్షకులు అంతా కనెక్ట్ అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని పక్కకు పెట్టి జూనియర్ అభిమానులు జూనియర్ మ్యాజిక్ టచ్ ని హైలెట్ చేస్తూ కామెంట్స్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు వరస విజయాలతో గెలుపు గుర్రంగా మారిన జూనియర్ అదృష్టం మహేష్ ‘భరత్’ ను తాకింది అన్న అభిప్రాయాలను కూడ జూనియర్ అభిమానులు వ్యక్త పరుస్తున్నారు. 
MAHESH IN BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో రాబోతున్న రోజులలో మహేష్ నటించే సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అంటే మరో హీరోని అతిధిగా పిలుచుకోవలసిన పరిస్థుతులు ఏర్పడతాయా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సెంటిమెంట్స్ కు చిరునామాగా ఉండే ఫిలిం ఇండస్ట్రీలో జూనియర్ అభిమానులు వెలుగులోకి తీసుకువచ్చిన ఈ గోల్డెన్ టచ్ సెంటిమెంట్ నమ్మకం కలిగించకపోయినా జూనియర్ ను పరోక్షంగా హైలెట్ చేసే విధంగా పరిస్థితి మారింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: