ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజ్‌ పాల్‌ యాదవ్‌ కు ఆరు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది.  ‘భూల్‌ భులయ్యా’, ‘పార్టనర్’, ‘హంగమా’  లాంటి ఎన్నో చిత్రాల్లో రాంపాల్ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించాడు.  కొన్ని టివి షోల్లో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో అందరినీ   నవ్వించిన ఈ హాస్య నటుడిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశం అయ్యింది.
Related image
వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఎంజీ అగర్వాల్‌ నుంచి తన తొలి హిందీ చిత్రం ‘అతా పతా లప‌తా’ కోసం 2010లో రాజ్ పాల్ యాదవ్ 5 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఢిల్లీలోని కర్ కర్ డుమా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.  తన బాకీ ప్రస్తావన తెచ్చినపుడల్లా రాంపాల్ యాదవ్ ఏదో కుంటిసాకులు చెబుతూ వస్తున్నాడని..తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. 
Image result for బాలీవుడ్ కామెడీ నటుడు రాంపాల్ యాదవ్ ఆయన భార్య రాధను ఢిల్లీలోని
గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కేసులో రాజ్ పాల్, రాధలకు న్యాయస్థానం ఆరురోజుల జైలు శిక్ష విధించడమే కాకుండా, ముంబైలోని మలాడ్ లోని యాక్సిస్ బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఖాతాతో పాటు, కంపెనీ అకౌంట్ ను స్తంభింపజేసింది. కృష్ణజింక కేసులో ఈ మద్య బాలీవుడ్ లో సల్మాన్ కేసు కూడా ఎంతో ఉత్కంఠ రేపి విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: