తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తేజ దర్శకత్వంలో రాబోతున్న విషయం తెలిసిందే.  ఈ మద్య అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా చేసుకొని ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.  ఇందులో విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ కనిపించబోతున్నారట. 
Image result for ntr biopic
ప్రస్తుతం నటీనటుల సెలక్షన్ పనిలో ఉన్నారు.  ఎన్టీఆర్ సతీమణిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని తీసుకుంటున్నాట్లు వార్తలు వస్తున్నాయి.  కొన్ని ముఖ్యపాత్రల్లో మహేష్ బాబు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే..వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనున్న దివంగత నేత ఎన్టీఆర్ బయోపిక్ లో బాల ఎన్టీఆర్ లుగా నారా, నందమూరి వంశాల వారసుడు, లోకేష్ కుమారుడు దేవాన్ష్ తో పాటు, కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యారామ్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Image result for ntr biopic
హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్న చిత్రంలో బాల ఎన్టీఆర్ గా దేవాన్ష్, యువ ఎన్టీఆర్ గా శౌర్యారామ్ కనిపిస్తారని సమాచారం.  అయితే ఎన్టీఆర్ యువకుడిగా ఉన్నపుడు ఎన్టీఆర్ పాత్రకు మోక్షజ్ఞను ఎంపిక చేయాలని చిత్ర దర్శకుడు తేజ భావించినారట..కానీ బాలకృష్ణ ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించారట.
Image result for nara devansh
సోలో హీరోగా తీసే సినిమాతోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉండాలని భావిస్తున్న బాలయ్య, ఈ సినిమాలో వద్దని తేజకు స్పష్టం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసే యోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ భావిస్తుందట..ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

Related image


మరింత సమాచారం తెలుసుకోండి: